న్యూస్ సినిమా

ఇడియట్ సినిమాని ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన మహేష్!

Share

టాలీవుడ్‌లో చాలామంది డైరెక్టర్లు సినిమాలు తీయటానికి సంవత్సరం దాకా సమయం తీసుకుంటారు. అయినా కూడా ఆ సినిమాలు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చెప్పలేం. కానీ పూరి జగన్నాథ్ మాత్రం నెలల వ్యవధిలోనే సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తుంటాడు. కథ రాయటానికి కూడా ఎక్కువ సమయం తీసుకోడు. అందుకే పూరి జగన్నాథ్ కి క్రేజీ డైరెక్టర్ అనే మంచి బిరుదు ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఇడియట్ సినిమా ఒకటి.

పూరి జగన్నాథ్ వేరే లెవెల్ డైరెక్టర్

పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఇడియట్ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఈ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగులు మాములుగా ఉండవు. కమిషనర్ కూతుర్ని ప్రేమించి ‘కమిషనర్ కూతుర్లకు పెళ్లిళ్లు కావా మొగుళ్లు రారా’ అనే డైలాగ్ తో కమిషనర్ కి చుక్కలు చూపిస్తాడు. ఈ సినిమాలో అన్ని డైలాగ్స్ ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కన్నడలో పూరి జగన్నాథ్, పునీత్ రాజ్ ని హీరోగా తీసుకొని ఇదే సినిమాను తెరకెక్కించారు. జగపతిబాబుని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బాచి’ సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమాను చూసిన పునిత్ తండ్రి రాజ్ కుమార్ పూరి జగనాథ్ ని పిలిచి పునీత్ ని పరిచయం చేసి అతని బాధ్యతని పూరి జగనాథ్ చేతిలో పెట్టాడు. దాంతో పూరి జగన్నాథ్ ‘అప్పు’ అనే సినిమాలో పునీత్ ని హీరోగా తీసుకున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మహేష్ అందుకే కాదన్నాడు

టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో రవితేజను స్టార్ హీరోని చేశాడు. ఇడియట్ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. రవితేజ కంటే ముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకుందామని పూరి జగన్నాథ్ ఈ కథని మొదట పవన్ కళ్యాణ్ కి చెప్పాడు.కానీ పవన్ కళ్యాణ్ కీ కథ నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత మహేష్ బాబుకు ఇడియట్ కథను వినిపించగా అతనికి డేట్స్ ఖాళీ లేకపోవడంతో మహేష్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశాడు. దాంతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రవితేజను వరించింది.


Share

Related posts

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau

Huzurabad By Poll: హుజూరాబాద్ ఎన్నికల బరిలో మరో విద్యార్థి విభాగం నేత..!!

somaraju sharma

బిగ్ బాస్ 4: ఈవారం డేంజర్ ఎలిమినేషన్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్..??

sekhar