Mahesh : మహేష్ సర్కారు వారి పాట..గోవాలో భారీ యాక్షన్ సీన్స్

Share

Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హై ఓల్టేజ్ మాస్, యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అంతేకాదు ఓ హాలీవుడ్ సినిమాలా ఇందులో ఫైట్స్ ఉండబోతున్నాయి. దానికి చిన్న శాంపిల్ కూడా పరశురాం ఇటీవల మహేష్ బర్త్ డే రోజు బ్లాస్టర్ అంటూ రిలీజ్ చేసిన టీజర్‌లో చూపించారు. ఈ టీజర్ తర్వాత సర్కారు వారి పాట మూవీ మీద భారీగా అంచనాలు పెరిగాయి.

mahesh-sarkaru vaari paata action scenes at Goa
mahesh-sarkaru vaari paata action scenes at Goa

ఇక మ్యూజిక్ సెన్షేషన్ తమన్ ఈ సినిమాకి ఇచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలెట్‌గా నిలవనుంది. అదికూడా తాజా టీజర్ బీజిఎం తో థమన్ శాంపిల్ చూపించారు. కాగా సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్, సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా సర్కారు వారి పాట లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్రారంభం అయింది. మహేష్ బాబు కొందరు ఫైటర్స్ మీద ఈ సీన్స్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రాం – లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నాడు పరశురాం. మహేష్ బాబు నుంచి సినిమా ఈసారి బాగా గ్యాప్ తో వస్తోంది.

Mahesh : మహేష్ దూకుడుకి కరోనా వేవ్స్ బ్రేక్ వేశాయి.

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్‌కా బాప్ అని భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. మరో సినిమాతో రావాలనుకున్న మహేష్ దూకుడుకి కరోనా వేవ్స్ బ్రేక్ వేశాయి. దాంతో రెండేళ్ళ లాంగ్ గ్యాప్ వచ్చేసింది. 2022 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈసారి బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాటకు భారీ పోటీ ఉంది. పవన్ – రానా, ప్రభాస్, వెంకీ – వరుణ్ తేజ్‌ల సినిమాలు బరిలో దిగుతున్నాయి.


Share

Related posts

కె.సి.ఆర్ బ‌యోపిక్ చేస్తా – వ‌ర్మ‌

Siva Prasad

చెత్త వార్త‌లు రాయ‌కండి

Siva Prasad

మ్యూజిక్ కంపెనీలకు ఎంఎన్ఎస్ హెచ్చరిక

somaraju sharma