Mahesh Babu : రాజమౌళితో సినిమా చేయకు ముందే మరొకరితో మహేష్..??

mahesh-babu-visits-dubais-smart-police-station
Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త మేక్ఓవర్ తో మహేష్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పిక్చర్లు సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచేస్తున్నాయి. కాగా ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

Mahesh with another before making a film with Rajamouli .. ??
Mahesh with another before making a film with Rajamouli .. ??

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మధ్యలో మరొక సినిమా చేయాలని..డిసైడ్ అయ్యాడట. దీంతో తాజాగా వెంకీ కుడుముల డైరెక్టర్ చెప్పిన కథ మహేష్ వినటం జరిగిందట. గట్టిగా నచ్చకపోవడంతో సరిలేరు నీకెవ్వరు అంటే సినిమా హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరెక్టర్ తో ఇటీవల ఒక సిట్టింగ్ వేసి ఒక కథ వినటం జరిగింది అది కూడా నచ్చకపోవడంతో మరో కథ అనిల్ రావిపూడి వినిపించడంతో రెండోది మహేష్ కి బాగా నచ్చినట్లు..రాజమౌళితో సినిమా చేయక ముందు అనిల్ రావిపూడి తో రెండో సారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం వర్గాలలో సరికొత్త వార్త వినబడుతుంది. ఒకపక్క “సర్కారు వారి పాట” చేస్తుండగానే మరోపక్క అనిల్ రావిపూడి తో కూడా మహేష్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 


Share

Related posts

పూరి జగన్నాధ్ మాటల్లో జీవం.. పోడ్ కాస్ట్స్ వినాల్సిందే..

Muraliak

సంక్రాంతికి పవన్ కల్యాణ్ తో పోటీకి దిగుతున్న ఆ టాప్ హీరో..??

sekhar

AIIMS Chief DR Randeep Guleria: కరోనా నిర్ధారణకు సీటీ స్కాన్ చేయించుకుంటున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!!

somaraju sharma