MaheshBabu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట ఏ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.. తాజాగా మహేష్ తరువాత సినిమా గురించి ఈరోజు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు మేకర్స్.. మహేష్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది..
తాజాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాకు సంబంధించిన సూపర్ న్యూస్ ను చిన్న వాయిదా వేస్తున్నాము.. త్వరలోనే గుడ్ న్యూస్ తెలుపుతాము.. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతుంటాయని మీకు తెలుసు.. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాము.. అని ట్వీట్ చేశారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన మహేష్ బాబు అభిమానులకు నిరాశే మిగిలింది.. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31వ తేదీన చెప్పనున్నట్లు సమాచారం. దీంతో నిరాశ పడ్డ అభిమానులు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా కు సంబంధించిన విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు .. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు క్లాసిక్ లు గా నిలిచాయి.. దీంతో మరో క్లాసిక్ సినిమా రానుందంటూ అభిమానులు అంటున్నారు.. సుమారు పది సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని పూర్తి డిఫరెంట్ రోల్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది..
There is a slight delay in our SUPER NEWS, but we're sure it will be worth it!
If you know, you know, sometimes delays happen!?
— Haarika & Hassine Creations (@haarikahassine) May 1, 2021