30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
న్యూస్

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

Share

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం  పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది.   బ్యాటరీల పేలుడు కారణంగా చూస్తుండగానే అగ్ని కీలలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీలోని కొంత భాగం కూలిపోయింది. మంటలు ఆర్పుతుండగానే భవనం కుప్పకూలడంతో పలువురు కార్మికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా శిధిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.ఘటనా స్థలంలో ప్రస్తుతం 35 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించారు.

గత నెల ఎనిమిదవ తేదీన అనాజ్‌మండిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


Share

Related posts

Sarkaru vaari paata: షాకిచ్చిన మహేష్ నిర్మాతలు..సర్కారు వారి పాటపై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే..!

GRK

Bigg Boss: హౌస్ లో .. సన్నీ కామెడీ..నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ …!!

sekhar

Leave a Comment