NewsOrbit
న్యూస్

మాజీ మేజర్ తప్పుడు వీడియో!

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీలో వచ్చే ‘పేట్రియాట్’ షో నిర్వాహకుడు, మాజీ సైనికుడు మేజర్ గౌరవ్ ఆర్య ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న కొంతమంది సైనికులకు చేతులు వెనకవైపు కట్టేసి ఉన్నాయి. వారిని యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కొడుతున్నట్లు ఉంది. దాంతోపాటే ఒక సందేశాన్ని కూడా ఆయన పెట్టారు. ‘‘ఫిబ్రవరి 27వ తేదీన బాలోచ్ రిపబ్లిక్ ఆర్మీ స్వాతంత్రయోధులు పాక్ ఆర్మీ పోస్టులపై దాడి చేశారు. అవి బెలూచిస్థాన్ లోని కెచ్ జిల్లా మాండ్ ప్రాంతంలోనివి. ఆ దాడి ఎంత తీవ్రమైనదంటే, ఫ్రాంటియర్ కోర్ వాళ్లు పారిపోయారు. వారిని పాక్ ఆర్మీలోని ఎస్.ఎస్.జి వాళ్లు పట్టుకుని దారుణంగా కొట్టారు’’ అని అందులో రాశారు. దాన్ని బట్టి చూస్తే బలోచ్ రిపబ్లిక్ ఆర్మీ వాళ్లు పాకిస్థానీ సైనిక శిబిరాలపై దాడి చేసినట్లుంది. ఆ తర్వాత ఫ్రాంటియర్ కోర్ దళం పారిపోయిందన్నారు. ఆ తర్వాత ఫ్రాంటియర్ కోర్ సైనికులను పట్టుకుని, పాకిస్థానీ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ కొట్టిందని చెప్పారు. ఆర్య చెప్పింది నమ్మాలంటే వీడియోలో కనిపించిన ఘటన ఫిబ్రవరి 27 తర్వాత జరిగి ఉండాలి.

పాత శిక్షణ వీడియో
కానీ ఈ వీడియోను ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ యూట్యూబ్ లో వెతికింది. తీరా చూస్తే అది ఫిబ్రవరి 5వ తేదీ నాటిదని తేలింది. అంటే, సైనికులు తమ శిబిరం వదిలి పారిపోయారనడానికి సరిగ్గా 22 రోజుల ముందు నాటిది. దాంతో, అసలు ఆ వీడియోలో చూపించిన ఘటన ఫిబ్రవరి 27 తర్వాత జరగనే లేదని అనుకోవాల్సి వస్తోంది.

తర్వాత వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, పాకిస్థాన్ ఎస్.ఎస్.జి. వాళ్లు తమ సైనికులు చిత్రహింసలను తట్టుకోవడానికి ఇచ్చే శిక్షణ అని తెలిసింది. వీడియోను ఒక్కో ఫ్రేము చొప్పున చూస్తే, సిబ్బందిలో ఒకరి టీషర్టు వెనకాల ‘ఇన్ స్ట్రక్టర్’ అని రాసి ఉంది. దాంతో అదంతా శిక్షణేనని తేలింది. ఇదే విషయాన్ని పలువురు సోషల్ మీడియా యూజర్లు ఎత్తి చూపినా, మేజర్ గౌరవ్ ఆర్య మాత్రం ఆ వీడియో శిక్షణకు సంబంధించినది కాదనే అన్నారు.

కానీ, ఆర్మీకి చెందిన మరో మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా మార్చి 12వ తేదీన వేరే రకంగా ఇదే వీడియోను పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఎస్.ఎస్.జి. వాళ్లు బాలోచ్ స్వాతంత్ర సమరయోధులను కొడుతున్నారని ఆయన అన్నారు.

https://twitter.com/MajorPoonia/status/1105456211305160704

వీడియోలో ఘటన ఫిబ్రవరి 27 లేదా ఆ తర్వాతే జరిగిందని మేజర్ గౌరవ్ ఆర్య పదే పదే చెబుతున్నా, అది యూట్యూబ్ లో కనీసం అందుకు 22 రోజుల ముందు తేదీతో అందుబాటులో ఉంది. తన ట్వీట్ ను డిలీట్ చేసేందుకు మేజర్ ఆర్య నిరాకరించారు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Leave a Comment