గూగుల్ ‘టాస్క్ మేట్’తో ఇలా డబ్బులు సులభంగా సంపాదించండి!

కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్న వారికి గూగుల్ టాస్క్ మేట్ ద్వారా డబ్బులు సంపాదించే ఒక సువర్ణ అవకాశం లభించింది. ఈ అప్లికేషన్ ద్వారా ఎక్కడి నుంచైనా పని చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఈ అప్లికేషన్ వినియోగదారులకు చిన్న చిన్న టాస్క్ లు పూర్తి చేసిన వెంటనే వినియోగదారులకు కొంత డబ్బును గూగుల్ టాస్క్ మేట్ చెల్లిస్తుంది.

ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ లో ఉండటం వల్ల వినియోగదారులు రిఫరల్ కోడ్ ఉపయోగించి మాత్రమే వాడగలరు. ఎవరైతే టాస్క్ మేట్ యాప్ ను వినియోగించుకోవాలనుకుంటారో, అలాంటి వారు రిఫరల్ కోడ్ కలిగి ఉంటే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

గూగుల్ చేత తయారు చేయబడిన ఈ అప్లికేషన్ ద్వారా వివిధ రకాల పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమకు ఆసక్తి ఉన్న పనులను మాత్రమే చేయవచ్చు. ఇష్టం లేని పనులను స్కిప్ చేసే అవకాశం కూడా గూగుల్ కల్పించింది. ఈ పనులను ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా చేసుకొని డబ్బులను పొందవచ్చు. అయితే వినియోగదారుల స్థానాన్ని బట్టి వారికి పనులను కేటాయించడం కూడా జరుగుతుంది.

గూగుల్ టాస్క్ మేట్ ద్వారా ఇచ్చిన పనులను పూర్తి చేయడానికి సరైన సమయాన్ని కూడా కల్పిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా సిట్టింగ్ టాస్క్ లేదా ఫీల్ టాస్క్ అని రెండు రకాలుగా విభజించి పనులను కేటాయిస్తారు. పని పూర్తి చేసిన తర్వాత వినియోగదారులకు ఖచ్చితంగా స్థానిక కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లిస్తుంది. నగదు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గూగుల్ చెల్లింపు భాగస్వామితో ఖాతాను నమోదు చేసుకొని, ఆపై ప్రొఫైల్ ఈ పేజీని సందర్శించి క్యాష్ బటన్ నొక్కితే డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.