Ghani: గని రిలీజ్ డేట్ మార్చి తప్పు చేసిన మేకర్స్..ఇప్పుడు సోలో డేట్ దొరకక టెన్షన్..

Share

Ghani: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. గద్దలకొండ గణేష్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు వరుణ్ తేజ్ నుంచి సినిమా రాలేదు. కానీ, మెగా అభిమానులకు మాత్రం ఎపుడెప్పుడు వరుణ్ సినిమా వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి డిసెంబర్ 3న గని సినిమా రిలీజ్ అని మేకర్స్ వెల్లడిచారు. ఆ మేరకు స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ, బాలకృష్ణ అఖండ సినిమా ఉండటంతో ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప సినిమా రిలీజ్ ఉంది. దాంతో డిసెంబర్ 24న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

makers are in tension about solo date to release ghani-
makers are in tension about solo date to release ghani-

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు గని సినిమా రిలీజ్ చేస్తున్నారని అందరూ చెప్పుకున్నారు. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని గత కొంతకాలంగా నానికి హిట్ లేక ఇబ్బంది పడుతూ శ్యామ్ సింగ రాయ్ కోసం సోలో డేట్ చూసుకుంటే వరుణ్ తేజ్ గని సినిమాతో వచ్చి గట్టిగానే పోటీ ఇస్తున్నాడని మాట్లాడుకున్నారు. కానీ, తీరా చూస్తే వరుణ్ తేజ్ గని సినిమాను సోలో డేట్ చూసుకొనే రిలీజ్ చేయాలని భావించి డిసెంబర్ 24న రిలీజ్ చేయడం లేదంటూ అనౌన్స్ చేశారు.

Ghani: జనాలు థియేటర్స్ వరకు రావడం కష్టమని చెప్పుకుంటున్నారు.

త్వరలో కొత్త డేట్ ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్న వేళ ఇప్పుడు మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. జనవరి నెలలో రిలీజ్ చేయాలనుకుంటే మూడు పెద్ద సినిమాలున్నాయి. కాబట్టి గని సినిమాను జనవరిలో రిలీజ్ చేయడం సేఫ్ కాదు. పోనీ ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామా అంటే 4వ తేదీన ఆచార్య సినిమా నుంచి మేజర్ సినిమా వరకు అన్నీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాబట్టి ఆ నెలలో కూడా గని రిలీజ్ చేయడం సేఫ్ కాదు. మరి మార్చ్ నెలలో రిలీజ్ అంటే ఎగ్జాంస్ ఉంటాయి కాబట్టి జనాలు థియేటర్స్ వరకు రావడం కష్టమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గని సినిమా రిలీజ్ పరిస్థితి అర్థం కాకుండా అయింది. అనవసరంగా డేట్ మార్చి మేకర్స్ పొరపాటు చేశారని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

ఏపీలోని అపోలో నుంచి తొలి టైర్ విడుదల

Muraliak

Suhana Khan : నెటిజన్ల కామెంట్స్ కు బిన్నంగా కౌంటర్ ఇచ్చిన స్టార్ కిడ్..!!

bharani jella

Gangavva : ఆయుర్వేద వైద్యం చేయించుకున్న గంగవ్వ

Varun G