Akasam ne hadhura : ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌కి మేకర్స్ ప్లాన్..

Share

Akasam ne hadhura : ‘ఆకాశం నీ హద్దురా’..కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన బయోపిక్. తమిళంలో సూరారై పోట్రుగా తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్థాయి హిట్ అందుకున్నాడు. లేడీ స్టార్ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి ఇందులో హీరోయిన్‌గా నటించారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.

makers plan for Akasam ne hadhura hindi remake
makers plan for Akasam ne hadhura hindi remake

థియేటర్స్ ఓపెన్ చేయకపోవడంతో వెయిట్ చేసిన సూర్య ఓటీటీకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో కొన్ని కాంట్రవర్సీలు తలెత్తాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అప్పులు పెరిగిపోతున్నాయని ఇక ఆగడం మంచిది కాదని ధైర్యం చేసి ఓటీటిలో రిలీజ్ చేసి భారీ హిట్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తారని ఎవరూ భావించలేదు. ఎట్టకేలకి ‘ఆకాశం నీ హద్దురా’ హిందీలోకి రీమేక్ కాబోతోంది. కానీ ఇంకా ఇందులో హీరో ఎవరు నటిస్తారన్నది ఇంకా తేలలేదు.

Akasam ne hadhura : హిందీ రీమేక్‌లో ఏ హీరో నటిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

బయోపిక్స్ వచ్చి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న క్రమంలో ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ – 2డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ లలో హీరో సూర్య – రాజశేఖర్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. కాగా ఇప్పుడు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని సూర్య – జ్యోతిక – రాజశేఖర్ పాండియన్ కలిసి హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం. ఇక ఈ సుధా కొంగర ఈ సినిమా హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. హీరో సూర్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే హిందీ రీమేక్‌లో ఏ హీరో నటిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.


Share

Related posts

Nimmagadda Ramesh Kumar : ఏ ఎన్నికల కమిషనర్ తీసుకుని నిర్ణయం పంచాయతీ ఎన్నికల్లో తీసుకోబోతున్న నిమ్మగడ్డ..??

sekhar

బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేసుకున్న పూరి.. వాళ్ళకి ఇక మామూలుగా ఉండదంతే ..!

GRK

Trivikram Ntr : తెలుగు హీరోయిన్ లు బట్టలు సర్దుకోవాల్సిందే – ఎన్‌టి‌ఆర్ కోసం త్రివిక్రమ్ పుత్తడి బొమ్మని తీసుకోస్తున్నాడు, చూడండి ఎంత బావుందో!

Teja