Makeup Artist: నీరజ్ చోప్రా నుండి మిల్కాసింగ్ దాకా ఎవరి లాగా అయినా మారిపోవడం ఈ అమ్మాయి స్పెషాలిటీ

Share

Makeup Artist: “ప్రియాంక పన్వార్”… ఈ పేరుని ఇప్పటివరకు మీరు విని ఉండకపోవచ్చు. 29 ఏళ్ల ఈ అమ్మాయి నెలకి లక్షలు తెచ్చిపెట్టే కార్పొరేట్ జాబ్ వదిలేసి తనకు ఎంతో ఇష్టం అయిన మేకప్ రంగంవైపు కి సాగింది. దేశంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుల లాగా మారిపోతూ తన ప్రస్థానం సాగించింది. 

 

ఈ రోజుల్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మేకప్ అనేది చాలా సులువు అయిపోయింది. 3-D ఆర్ట్ ద్వారా ఎవరి బొమ్మ నైనా సులువుగా తయారు చేస్తున్నారు. ఇలాంటి కొన్ని ట్రిక్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంటున్న అందరితో పోలిస్తే ప్రియాంక చాలా భిన్నం. ఎటువంటి ముఖాన్ని అయినా నిమిషాల్లో రీసెర్ఛ్ చేసి వారి లాగా మారిపోతుంది. ప్రోస్థెటిక్స్ వాడకుండా తనే అబ్బాయిల్లాగా, పాపులర్ సెలబ్రిటీల గా మారిపోతూ ఉంటుంది. 

జాబ్ వదిలి… మేకప్ మెచ్చి…

ప్రియాంక మేకప్ ఇండస్ట్రీకి రాకముందు అసలు తనకు మేకప్ విషయమై పరిశోధన చేయాలన్న ఆసక్తి కూడా లేదు. రెండున్నరేళ్ల పనిచేసిన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి 2018 ఆమె బయటికి వచ్చేసింది. చిన్నప్పటినుంచి కొద్దిగా ఆసక్తి ఉన్న మేకప్ రంగం వైపు అడుగులు వేసిన ఆమె ఇక అదే తన జీవితాన్ని మారుస్తుంది అని అనుకోలేదు. ఏ ఒక్క ముఖానికి తన రూపుని మార్చుకోవాలన్నా… దాని వెనుక ఉన్న 11 గంటల కష్టం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్న 22 వేల మంది ఫాలోవర్స్ కు తెలియకపోవచ్చు. అయితే ఆమె మాత్రం ఎలాంటి ప్రోస్థెటిక్స్ లేకుండా బాల్డ్ క్యాప్స్, కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించి క్షణాల్లో మరొకరిలా మారిపోతుంది. 

ఎంతో పరిశోధన చేసి పట్టుదలతో కృషి చేసి తను ఎవరిలా మారాలనుకుంటుందో వారి గడ్డం, బుగ్గలు, ముక్కు వంటి అనేక భాగాలను కచ్చితత్వంతో కొలతలు తీసుకొని దానికి తగ్గట్లు ప్రిపేర్ అవుతుంది. ఇందులో ఆమె చూపించే ఓపిక అసామాన్యం. చిన్న తేడా వచ్చినా కూడా మళ్లీ మొదటి నుంచి ఆమె మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే తాను చేసుకునే కెమెరా యాంగిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ కొద్దిగా తేడా అయినా కూడా మొత్తం చెడిపోతుంది. 

అంచెలంచెలుగా ఎదిగి

కొన్నిసార్లు కష్టపడి 10 గంటల పాటు చేసిన పని కూడా అప్పుడప్పుడు వృధా అయిపోతుంది. తను చేసిన మేకప్ ద్వారా ఆమె కొంచెం కూడా సంతృప్తి చెందకపోతే మళ్ళీ మొదటి నుంచి చేయవలసి వస్తుంది. ఇలా తను చేస్తున్న పని నుండి ప్రేరణ పొందిన ఆమె కుటుంబ సభ్యులు కూడా తనకి సహాయం చేయడం మొదలు పెట్టారు. ఇక పాపులర్ మూవీ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ల్ఫ్లిక్స్ 2021′ లో విడుదలైన ‘రే’ మూవీ లో కాయ్ కాయ్ మీనన్ లుక్ ని మేకప్ చేయమని ఆమెన్ అడిగారు. 

Makeup Artist: ఎన్నో ముఖాలు అబ్బురపరిచేలా… 

అంతలా పాపులర్ అయినా ఆమె మిస్టర్ బీన్ గా మారింది. మిల్కా సింగ్ గా మారింది… సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నీ తలపించింది… మానవజాతి మొదలైన కోతి లాగా కూడా తనను తాను మార్చుకుంది. ఇలా అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం సాగిస్తున్న ప్రియాంక భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ… ఆమెను ఆదర్శంగా పలువురు తీసుకొని తమ అభిరుచులని కెరీర్ లుగా మలచుకుంటారని కోరుకుంటున్నాం.


Share

Related posts

Allu Arjun : మహేష్ బాబు డైరెక్టర్ తో అల్లు అర్జున్..??

sekhar

బిజెపి, కాంగ్రెస్‌పై కెసిఆర్ ఫైర్

somaraju sharma

Sonal Chauhan Yoga Photos

Gallery Desk