రామ్ రెడ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. నిన్నా, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నరామ్ ఒక్కసారిగా రెడ్ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ కమర్షియల్ హిట్ అందుకున్న రామ్ .. తను నటించిన లేటెస్ట్ సినిమా రెడ్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం సినిమాని రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ లో నిర్మించారు రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్.
ఇక ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సూపర్ హిట్స్ వచ్చి ఉండటంతో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన రెడ్ మీద భారీగా అంచనాలు ఏరడ్డాయి. కాగా ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
డ్యూయల్ రోల్ లో రామ్ బాగా ఆకట్టుకున్నాడు. అదే ఇప్పుడు రామ్ రెడ్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అవడానికి కారణం అయింది. అయితే పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మీద హీరోయిన్స్ బాగా నమ్మకాలు పెటుకున్నారు. ముఖ్యంగా రెడ్ సినిమా మీద మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ కెరీర్ ఆధారపడి ఉందని అంటున్నారు.
మాళవిక శర్మ .. రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ కావడం తో మళ్ళీ ఛాన్స్ రాలేదు. లక్కీగా రామ్ రెడ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. అలాగే నివేదా పేతురాజ్ కూడా సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా అంత హిట్ అయినా అది నివేదా పేతురాజ్ కి ఉపయేగపడలేదు. అందుకే ఈ బ్యూటీ కూడా ఈ సినిమా మీదే చాలా ఆశలు పెట్టుకుంది.