Male Menopause: పురుషులకూ మెనోపాజ్ ..! దేనిపై ప్రభావం చూపుతుందంటే..?

Share

Male Menopause: మెనోపాజ్ మహిళలకే వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ పురుషులు కూడా మెనోపాజ్ కు గురి అవుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో అండ్రోపాజ్ అంటారు. మహిళలకు వచ్చేదాన్ని మెనోపాజ్ అని, పురుషులకు వచ్చేదాన్ని అండ్రోపాజ్ అని అంటారు. ఓ వ్యక్తి 30 సంవత్సరాల వయసు దాటిన తరువాత అతని టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ప్రతి ఏడాది సగటున ఒక శాతం తగ్గుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న మహిళల్లో రుతుక్రమం ఆగిపోతుంది. దాన్నే మెనోపాజ్ అంటారు. స్త్రీత్వాన్ని దూరం చేస్తుందని భావిస్తున్న కొంత మంది విదేశాలలోని మహిళలు హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరఫీ (హెచ్ఆర్టీ) ఎంచుకుంటారు.

Male Menopause it affects infertity
Male Menopause it affects infertity

 

Male Menopause: చికిత్స కంటే జీవన శైలి మార్చుకోవడం మేలు

పురుషుల మెనోపాజ్ కు కూడా హెచ్ఆర్టీ చికిత్స ఉంది. అయితే పురుషులు మెనోపాజ్ ను అధిగమించడానికి జీవన శైలి మార్పుపై అవగాహన పెంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. హెచ్ఆర్టీ చికిత్సకు వెళ్లకుండా ఉండటమే మంచిదని పేర్కొంటుంటారు. పురుషుల్లో మెనోపాజ్ కారణంగా లైంగిక కోరిక తగ్గుతుంది. వీళ్లు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయడం, ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండే విధంగా చూసుకోవడం, తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చేయాలి. ప్రతి రోజు ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించాలి. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులతో పాటు ఆహార మార్పులు చేసుకుంటే పురుషుల్లో వచ్చే మెనోపాజ్ ని కొంత వరకు తగ్గించుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య అధిగమించేందుకు ఏదైనా చికిత్స చేయించుకోవాలను కుంటే అనుభవం, అర్హత ఉన్న వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచిది.


Share

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

somaraju sharma

ముంబాయిలో ‘బాబు’ ప్రచారం

somaraju sharma

శృంగారం లో ఆ ఫీలింగ్స్ ఎందుకు కలుగుతాయో తెలుసా??

Kumar