NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : తెలంగాణలో కొత్త ఎపిసోడ్ కు తెరలేచింది!కెసిఆర్ పీఎం కావాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారి ఆకాంక్ష!

KCR : “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి”.. ఈ మాట అన్నది సాక్షాత్తు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. అవును… మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నాయని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Mallareddy Aspires KCR to become PM
Mallareddy Aspires KCR to become PM

70 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించిన మల్లారెడ్డి.. సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలలోనే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాష్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. సాగునీరు, త్రాగునీరు, ఫించన్లు అర్హులైన అందరికీ అందజేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రిది అని తెలిపారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందని, అందుకే కేసీఆర్‌ను పీఎం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే.. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు.  చివర్లో తన స్పీచ్ ముగిస్తూ తన శాఖ పద్దు చాలా చిన్నదని.. సభ్యులందరూ సహకరించి పద్దును ఆమోదించాలని కోరడంతో మంత్రులు..హరీష్ రావు, కేటీఆర్ సహా సభ్యులంతా నవ్వులు చిందించారు.కాగా ఇప్పడే కాదు మంత్రి మల్లారెడ్డి సభలో ఎప్పుడు ప్రసంగించినా.. తన మార్క్ కామెంట్స్ చేస్తారు. గతంలో కూడా ఆయన పలుసార్లు చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఆయన మాట్లాడే విధానం.. యాస విభిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
తెలంగాణ మంత్రుల రూటే సపరేటు!

రెండు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ మంత్రులు పల్లవి అందుకున్నారు.సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ తో మొదలైన ఈ గానాబజానా చాలా రోజులు సాగింది. ఏకంగా పద్మారావు అనే మంత్రయితే కేటీఆర్ ఉన్న సభావేదికమీదే ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ కీర్తించారు.అయితే కేటీఆర్ ఖండించకపోగా చిరు నవ్వులు చిందించడం ఇక్కడ విశేషం.అయితే మధ్యలో ఏమైందో గానీ కెసిఆర్ కి చుర్రుమంది. ముఖ్యమంత్రి మార్పు లేదు..ఇకపై ఆ తరహా ప్రకటనలు చేస్తే తోకలు కత్తిరిస్తానని స్థాయిలో కెసిఆర్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు.ఇంతటితో ఆ ఎపిసోడ్ ముగియగా ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ని పీఎం చేయాలన్న పిలుపుతో కొత్త ఘట్టానికి తెర తీశారు.

 

author avatar
Yandamuri

Related posts

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N