NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే .. బాధ్యతలు అప్పగించిన సోనియా

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పై మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రా, కేసి వేణుగోపాల్ సహా ఇతర ముఖ్య నేతలు హజరైయ్యారు.

AICC

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు సోనియా, రాహుల్ గాంధీలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను ఖర్గేకు సోనియా అప్పగించారు. కొత్త నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానని సోనియా గాంధీ పేర్కొన్నారు. సీనియర్ నాయకుడైన ఖర్గే నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పారు. ఖర్గేకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు చాలా సవాళ్ల ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కొని ముందుకు నడిపించే సమర్ధత ఉందని నమ్ముతున్నానని అన్నారు సోనియా గాంధీ.

నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. బాధ్యతల నిర్వహణలో అందరి సహకారం తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నారు. అధికార రాజకీయాల యుగంలో సోనియా గాంధీ నిశ్వార్ధ త్యాగం అసమానమైనదని కొనియాడారు ఖర్గే.

దాదాపు 24 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర నేతగా ఖర్గే అరుదైన ఘనత సాధించారు. జగజ్జీవన్ రామ్ తద్వార ఆ పదవి చేపట్టిన రెండో దళిత నేతగానూ ఖర్గే నిలిచారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N