NewsOrbit
న్యూస్

Mamata Banerjee: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని భావిస్తున్న సీఎం!భవానీ పూర్ నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మమతా బెనర్జీ !!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సురక్షితమైన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించినప్పటికీ ఆమె మాత్రం నందిగ్రామ్ లో ఓడిపోవటం తెలిసిందే.పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఓటమి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.నిజానికి మమతా బెనర్జీకి కూడా ఈ పరాజయం జీర్ణించుకోలేనిదే.

Mamata Banerjee enters Assembly polls from Bhavanipur
Mamata Banerjee enters Assembly polls from Bhavanipur

తన కటౌట్లు పెట్టి రెండొందలమంది ని గెలిపించిన మమతా బెనర్జీ తను స్వయంగా ఓడిపోవడాన్ని తీవ్రంగానే తీసుకున్నారు.టీఎంసీ లో తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి చేతిలో ఓటమి పాలుకావడం మమతా బెనర్జీకి మరో అవమానం.ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సువేందు నందిగ్రామ్ లో మమతను ఓడించారు. ఆఖరి రౌండ్లో మమతా బెనర్జీ కి వెయ్యి ఓట్ల ఆధిక్యత ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం ఆ ఫలితాన్ని ప్రకటించలేదు. రెండు గంటల తర్వాత ఆమె పన్నెండొందల ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు సువేందు గెలిచినట్టు అధికారికంగా ప్రకటించారు.దీని పైన మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.ఏదేమైనప్పటికీ మమతా బెనర్జీ మళ్లీ సీఎంగా ఉన్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరునెలల లోపు తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

Mamata Banerjee: భ‌వానీపూర్ నుంచే బరిలోకి!

ఈ నేపధ్యంలో ఆమె తిరిగి తన పాత నియోజకవర్గం భ‌వానీపూర్ నిబ అసెంబ్లీలో రీఎంట్రీకి సురక్షితమైన నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.2011,2016 ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.మొన్నటి ఎన్నికల్లోనే నందిగ్రామ్ కు షిఫ్ట్ అయి పరాజయం పాలయ్యారు.ఇంకోసారి రిస్క్ తీసుకునే ఉద్దేశం లేకుండా మమతా బెనర్జీ మళ్ళీ భ‌వానీపూర్ దారి పట్టనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.ఉప ఎన్నిక కోసం ప్రస్తుతం భ‌వానీపూర్ లో గెలుపొందిన టీఎంసీ ఎమ్మెల్యే సొవ‌న్ దేవ్ ఛ‌టోపాధ్యాయ్ తన ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా పార్టీ సైతం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ఆయన అసెంబ్లీ స్పీకర్ కి తన రాజీనామా పత్రం సమర్పిస్తారని కూడా తెలుస్తోంది.అయితే బీజేపీ ఇక్కడ కూడా ఆమెను అంత సులువుగా గెలవనిస్తుందా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. మళ్లీ హోరాహోరీ పోరు తప్పకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!