కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రాన్ని సరికొత్త డిమాండ్ చేసిన మమతా బెనర్జీ..!!

ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశ కరోనా వ్యాక్సిన్ విషయంలో పారిశుద్ధ్య కార్మికులు అదే విధంగా ఆరోగ్య సిబ్బంది కి మొదట వేయించాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రీతిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఉంటే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు అందుకోసం ఎంత ఖర్చైనా పరవాలేదు రాష్ట్రానికి వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది మమతా బెనర్జీ.

Mamata Banerjee trains guns at Centre as BJP alleges attack on Nadda convoy  | India News,The Indian Expressప్రాణం ఎవరికైనా విలువైనదే అని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తో పాటు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది దీదీ. బెంగాల్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీ పడను అని మమతా బెనర్జీ పేర్కొంది.

 

ఇదిలా ఉంటే త్వరలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ని అడ్డం పెట్టుకుని బీజేపీ పొలిటికల్ ఎత్తుగడలు వేస్తోంది ఏమో అని ముందుగానే మమతాబెనర్జీ ఈ రీతిలో చెక్ పెట్టడం జరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.