బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మమతాబెనర్జీ..!!

త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సారి భభిన్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి దీదీ భారీ స్థాయిలో మెజారిటీ సాధించారు. కానీ ఈసారి మాత్రం పోటీ విషయంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేటర్ లోకి వెళ్తే నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయటానికి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు.

Bengal polls: Mamata says will fight from Suvendu turf Nandigram; 'will  defeat her or quit politics', he hits back | India News,The Indian Expressదీంతో దీదీ చేసిన ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. నందిగ్రామ్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ భారీ స్థాయిలో అప్పట్లో తెచ్చిపెట్టింది. మేటర్ లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో రైతులకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

దీంతో రైతుల పక్షాన 2011 వ సంవత్సరంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ పోరాటానికి దిగటంతో, ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో.. పాటు కమ్యూనిస్టులపై వ్యతిరేకత ఏర్పడటంతో మమతా బెనర్జీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పటినుండి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మమతాబెనర్జీ రాణిస్తుంది. ఇదిలాఉంటే నందిగ్రామ్ నియోజకవర్గం నుండి గెలిచిన తృణముల్ అభ్యర్థి ఇటీవల బీజేపీలో చేరడం తో.. మమతా బెనర్జీ ఈ నియోజకవర్గం నుండి పోటీకి రెడీ అవ్వటం సంచలనంగా మారింది.