NewsOrbit
న్యూస్

మమత కి ఇక కలత రాత్రులే !కమల దళం దండయాత్ర ఈసారి బెంగాల్ పైనే!

ప‌శ్చిమ‌బెంగాల్‌పై బీజేపీ స్పెష‌ల్‌ ఫోక‌స్ పెట్టింది. తృణ‌మూల్ అధికార పీఠాన్ని దించేలా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి జ‌ర‌గ‌నంత వ‌ర‌కు బెంగ‌ల్ రాజ‌కీయాలు ఒక ఎత్తైతే.. కాన్వాయ్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఒక ఎత్తైంది. ఈ ఘ‌ట‌న‌లో బెంగాల్‌పై కాషాయ ద‌ళం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది. ఏకంగా 9 మంది ఎమ్మెల్యేల‌ను, ఓ ఎంపీకి బీజేపీ కండువా క‌ప్పి అటు అధికార పార్టీకి, ఇటు విప‌క్షాల‌కు గ‌ట్టి షాకిచ్చింది. అంతేకాకుండా ఏకంగా ఆరుగురు కేంద్ర మంత్రుల‌ను బెంగాల్‌కు పంపింది క‌మ‌ళ‌ద‌ళం.నెల‌లో 15 రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించింది. ఏలాగైనా ఈ సారి బెంగాల్‌లో బీజేపీ జెండా పాతాల‌ని ప‌దునైనా వ్యూహాలు ర‌చిస్తోంది.

అంతేకాకుండా మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక‌పై నెల‌కోసారి ఖ‌చ్చితంగా బెంగాల్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం ప‌ర్య‌టించ‌డ‌మే కాకుండా నెల‌కు ఏడు రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తార‌ని బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ప్ర‌కటించారు. ఇక‌పై అమిత్ త‌ర‌చూ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తారు.. ఓ నెల‌లో ఏడు రోజుల పాటు బెంగాల్‌లో మ‌కాం వేసి దిశానిర్దేశం చేస్తార‌ని తెలిపారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఇప్ప‌టి నుంచి క‌మ‌ల ద‌ళం ఉవ్విళ్లూరుతోంది.

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల జేపీ న‌డ్డా కాన్వాయ్ పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బెంగాల్‌పై బీజేపీ మ‌రింత దృష్టి సారించింది. ముందు నుంచే ప‌క్కా ప్లాన్ వేసి బెంగాల్ ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ముందు నుంచే వ్యూహాలు ర‌చిస్తోంది బీజేపీ. మ‌రి బెంగాల్ పై కాషాయ ద‌ళం వేస్తున్న ఎత్తుగడలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.ఒక్కో రాష్ర్టాన్ని గెలుచుకుంటూ పోతున్న బిజెపి దండయాత్ర ఈసారి పశ్చిమబెంగాల్ పైనే అన్నది స్పష్టం!

 

author avatar
Yandamuri

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N