అల్లాదీన్ అద్బుత దీపం అంటూ ఘ‌రాన మోసం!

స్పైడ‌ర్ మ్యాన్ లేక్క‌ పాకాలి, సూప‌న్ మ్యాన్ లేక్క ఎగ‌రాలి.. అవేంజ‌ర్స్ లేక్క స్పెష‌ల్ ప‌వ‌ర్స్ రావాలంటే ఎట్లా.. అవి సినిమాలు. కేవ‌లం క‌ల్పితారు. అవే ఉంటే ఆ సినిమాలు తీసేవారు అంత తిప్ప‌లెందుకు ప‌డ‌తారు చెప్పండి. కానీ విటిని న‌మ్మొద్ద‌ని తెలిసిన కొంద‌రు చ‌దువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఇలాంటి ఉచ్చులో ప‌డిపోతున్నారు. చివ‌ర‌కు మొస‌పోయాన‌ని తెలుసుకుని నాలుక‌ల‌ను క‌ర్చుకుంటున్నారు.

మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌వ‌ని తెలిసికూడా మోస‌పోతున్నారు. ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కేటుగాళ్ల‌కు దార‌పోస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఉత్తర్‌ ప్రదేశ్ వెలుగులోనికి వ‌చ్చింది. అల్లాద్దీన్ అద్బుత దీపం పేరుతో డాక్ట‌ర్ కు పంగ నామం పెట్టారు కేటుగాళ్లు. ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అత‌ని నుంచి గుంజేశారు. అద్బుత దీపాన్ని ఎంత అడిగినా ఇవ్వ‌క‌పోవ‌డంతో అత‌నికి మొస‌పోయిన‌ట్లు బోద ప‌డింది. దాంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకుని రిమాండ్ కు త‌ర‌లించారు. ఈ విష‌యంపై పోలీసులు మీడియాతో మాట్లాడారు. దాని ప్ర‌కారం లండన్ నుంచి వచ్చిన డాక్టర్ లాయిక్ ఖాన్‌ను అనారోగ్యంతో ఉన్న సమీనా అను మహిళ సంప్రదించింది. ఆమెకు ట్రిట్మెంట్ చేయ‌డానికి డాక్ట‌ర్ ఖాన్ నెల రోజుల పాటు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో డాక్ట‌ర్ తో స‌మీనా త‌న క‌ష్ట సుఖ‌ల‌ను పంచుకుంది. త‌న బాధ‌లు అన్ని పోవ‌డానికి ఒక‌త‌ను చాలా హెల్ప్ చేశాడ‌ని తెలిపింది. డాక్ట‌ర్ కు ఏమైనా స‌మస్య‌లు ఉంటే వెళ్ల‌మ‌ని చేప్పింది.

దాంతో డాక్ట‌ర్ ఖాన్ ఇస్లాముద్దీన్ అనే మాంత్రికుని క‌లిశాడు. తన ద‌గ్గ‌ర అల్లాద్దీన్ అద్భుత దీపం ఉందని, దాని సాయంతో ఏ బాధలనైనా ఇట్టే పోగొడుతాన‌ని ఇస్లాముద్దీన్ చెప్పుకొచ్చాడు.దీన్ని డాక్ట‌ర్ ఖాన్ నిజ‌మేని అనుకున్నాడు. రూ. 1.75 కోట్లు ఇస్తే.. ఆ అల్లాదీన్ దీప్పాన్ని ఇస్తాని ఇస్లాముద్దీన్ చెప్పాడు. చివ‌రికి రూ. 70 ల‌క్ష‌ల‌కు బేరం కుదుర్చుకున్నారు. అనుకున్న‌ట్లు డాక్ట‌ర్ ఖాన్ డ‌బ్బుల‌ను చెల్లించాడు. ఎంత‌కీ ఆ దీపాన్ని ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌ను మోస‌పోయాన‌ని గ్ర‌హించాడు డాక్ట‌ర్ ఖాన్.

చివరకు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు మాంత్రికుడు ఇస్లాముద్దీన్ సమీనా భర్తేనని గుర్తిచారు. దాంతో ఇస్లాముద్దీన్ తో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన‌ అనీస్ ని అరెస్టు చేశారు. వారి ద‌గ్గ‌ర నుంచి బంగార వర్ణంలో ఉన్న ల్యాంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్లాద్దీన్ అద్బుతీ దీపం, తంత్ర విద్యల‌ పేరుతో నిందితుడు చాలా మందిని మోసం చేసినట్టు విచారణలో బ‌య‌ట‌ప‌డింది. ఈ ముఠా బాధితుల్లో చాలా మంది ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. ఇందులోని ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప‌రారీలో ఉన్న స‌మీనా కోసం గాలిస్తున్నారు.