Laptop Funeral: ల్యాప్ టాప్ Laptop Funeral ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. గాడ్జెట్స్ లేనిదే మనిషి జీవితం ముందుకు వెళ్లలేని పరిస్థితి. బ్యాంకు సేవలు, ప్రయాణం టికెట్లు, సినిమా టికెట్లు, వార్తలు, ఎంటర్ టైన్మెంట్.. చివరికి సినిమాలు కూడా మొత్తం డిజిటల్ గానే సెల్ ఫోన్ల రూపంలోనే అందుబాటులో ఉన్నాయి. ఇక ట్యాబ్, ల్యాప్ టాప్, ఐ వాచ్.. ఇలా చాలా ఉన్నాయి. నేడు ఇవి మన శరీరంలో భాగాలైపోయాయి. చెప్పాలంటే.. అంతకుమించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఓ వ్యక్తి దీన్ని నిజం చేశాడు. తాను ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న ల్యాప్ ట్యాప్ పాడవటం తట్టుకోలేకపోయాడు. రిపేర్ కాదని తెలిసి స్క్రాప్ చేయడం ఇష్టంలేక ఆ ల్యాప్ టాప్ కు అంత్యక్రియలు చేయాలని భావించాడు.

చదవడానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజం. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ యువకుడు స్మశానవాటికకు వెళ్లి.. అక్కడ రిసెప్షనిస్టుతో అంత్యక్రియలు చేయాలని చెప్పాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్టు.. సహజంగానే మృతదేహం ఎక్కడ అని అడిగింది. అది మృతదేహం కాదు.. ల్యాప్ టాప్ అని చెప్పి ల్యాపీని తీసి చూపించాడు. ఆశ్చర్యపోయిన ఆమె ఇదేంటని అడిగింది. ‘అంత్యక్రియలు చేయాల్సింది దీనికే’ అని చెప్పాడు. విస్తుపోయిన ఆమె ఆ యువకుడి వంక ఎగాదిగా చూసి ‘నో’ చెప్పింది. మీ ల్యాప్ టాప్ చచ్చిపోయిందా? అని ఆమె అడగుతుంటే.. అవునని యువకుడు ల్యాపీని చూపిస్తున్నాడు.
Read More:Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!
ఇప్పుడు ఇంటెర్నెట్ ను షేక్ చస్తోందీ వీడియో. నిజానికి ఈ విడియోను ఓ టిక్ టాక్ స్టార్ చేశాడు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై మనం చూపే ప్రేమను చెప్పేందుకే ఈ వీడియో చేసానట్టు చెప్పుకొచ్చాడు. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ టిక్ టాక్ వీడియో ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. టిక్‌టాక్ స్టార్ జెన్ @కింగ్‌జెన్ ఈ వీడియో చేశాడు. ఈ తతంగమంతా వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో ఈ టిక్‌టాక్ వీడియోకు బాగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే జెన్ ఏ దేశస్తుడో వీడియోలో చెప్పలేదు.