NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతున్నాడ‌ని.. షాపును జేసీబీతో కూల్చేశాడు.. చివరికి?

పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఫలానా వక్తికి మా అమ్మయిని ఇవ్వాలనుకుంటున్నాం.. అతను ఎలాంటోడు అని విచారించ‌డం సాధారణమే కదా.. అబ్బాయి మంచోడు కాదు అని ఎవ‌రైనా చెప్తే.. ఆ అబ్బాయికి పిల్లను ఇవ్వడానికి ఇష్టపడుతారా.. ? లేదు క‌దా.. ఇలా ఒక అబ్బాయిని చూడ‌టానికి వ‌చ్చిన అన్ని సంబంధాల‌ను ఒక‌త‌ను చెడ‌గొడుతుంటే.. అత‌ను ఏం చేయాలి ? ఆ బాధ ఎవ‌రికి చెప్పుకోవాలి. అలాంటి ఘ‌ట‌నే కేరళ‌లోని కన్నూరు జిల్లాకు చెందిన వ్య‌క్తికి ఎదురైంది.

దీంతో ఆ యువకుడు ప‌ని క‌ట్టుకుని త‌న పెళ్లి సంబంధాల‌ను చెడ‌గొడుతున్న వ‌క్తి దుకాణాన్ని కూల్చేశాడు. వివ‌రాల్లోకి పోతే.. కన్నూరు జిల్లాకు చెందిన అల్బిన్‌ మాథ్యూ (30) పెళ్లికి రెడీ అయ్యాడు. ఇంట్లోవాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా.. ఒక్కటి కూడా సెట్ కాలేదు. దీనికి కారణం.. అల్బిన్ ఇంటి ముందు ఉన్న దుకాణమేన‌ని తెలిసింది. స్థానికులు రోజూ అక్కడ మ‌ద్యం తాగుతూ, జూదం ఆడతారు. దీంతో అల్బీన్ ఫ్యామిలీ వారు ఎప్పటి నుంచో ఆ దుకాణంపై ఆఫీస‌ర్ల‌కు ఫిర్యాదు చేస్తునే ఉన్నారు. కానీ ఏ ఆఫీస‌ర్ దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ దుకాణదారునికి, అల్బీన్‌కు మధ్య గొడవలు మొదల‌వుతూ వ‌చ్చాయి. దీంతో ఆ దుకాణ‌దారుడు అల్బిన్‌‌కు వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టడం షూరు చేశాడు. ఇది తెలుసుకున్న అల్బిన్ కు కోపం ఎక్కువైంది.

సోమవారం జేసీబీతో ఆ దుకాణాన్ని కూల్చి వేయించాడు. అలాగే అక్క‌డ జ‌రుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అంద‌రికీ తెలిసేలా వివరించాడు.దీన్ని వీడియో తీయించి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స‌ద‌రు దుకాణ‌దారుడు స్పందిస్తూ .. అతడి ఆరోపణల్లో నిజం లేదని, వ్యక్తిగత కక్షతోనే దుకాణాన్ని కూల్చేశాడని తెలిపాడు. నిజాలు పోలీసుల ద‌ర్యాప్తులో తెలుస్తాయి కానీ ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ లో ఉంది మీరు కూడా ఒక లుక్ వేయండి.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju