పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఫలానా వక్తికి మా అమ్మయిని ఇవ్వాలనుకుంటున్నాం.. అతను ఎలాంటోడు అని విచారించడం సాధారణమే కదా.. అబ్బాయి మంచోడు కాదు అని ఎవరైనా చెప్తే.. ఆ అబ్బాయికి పిల్లను ఇవ్వడానికి ఇష్టపడుతారా.. ? లేదు కదా.. ఇలా ఒక అబ్బాయిని చూడటానికి వచ్చిన అన్ని సంబంధాలను ఒకతను చెడగొడుతుంటే.. అతను ఏం చేయాలి ? ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి. అలాంటి ఘటనే కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన వ్యక్తికి ఎదురైంది.
దీంతో ఆ యువకుడు పని కట్టుకుని తన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్న వక్తి దుకాణాన్ని కూల్చేశాడు. వివరాల్లోకి పోతే.. కన్నూరు జిల్లాకు చెందిన అల్బిన్ మాథ్యూ (30) పెళ్లికి రెడీ అయ్యాడు. ఇంట్లోవాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా.. ఒక్కటి కూడా సెట్ కాలేదు. దీనికి కారణం.. అల్బిన్ ఇంటి ముందు ఉన్న దుకాణమేనని తెలిసింది. స్థానికులు రోజూ అక్కడ మద్యం తాగుతూ, జూదం ఆడతారు. దీంతో అల్బీన్ ఫ్యామిలీ వారు ఎప్పటి నుంచో ఆ దుకాణంపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తునే ఉన్నారు. కానీ ఏ ఆఫీసర్ దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా ఆ దుకాణదారునికి, అల్బీన్కు మధ్య గొడవలు మొదలవుతూ వచ్చాయి. దీంతో ఆ దుకాణదారుడు అల్బిన్కు వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టడం షూరు చేశాడు. ఇది తెలుసుకున్న అల్బిన్ కు కోపం ఎక్కువైంది.
సోమవారం జేసీబీతో ఆ దుకాణాన్ని కూల్చి వేయించాడు. అలాగే అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అందరికీ తెలిసేలా వివరించాడు.దీన్ని వీడియో తీయించి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై సదరు దుకాణదారుడు స్పందిస్తూ .. అతడి ఆరోపణల్లో నిజం లేదని, వ్యక్తిగత కక్షతోనే దుకాణాన్ని కూల్చేశాడని తెలిపాడు. నిజాలు పోలీసుల దర్యాప్తులో తెలుస్తాయి కానీ ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ లో ఉంది మీరు కూడా ఒక లుక్ వేయండి.