NewsOrbit
Featured న్యూస్

వాక్సిన్ వికటించిందా..!? దీపక్ ఎలా చనిపోయారు..!?

వాక్సిన్ వచ్చేస్తుంది. కరోనా పోతుంది. చింతలేదు అనుకుంటున్నా తరుణంలో ఓ సంఘటన కొత్త ఆందోళనలు కలిగిస్తుంది. భారత్ బయోటెక్ విడుదల చేసిన “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ లో టీకా వేసుకున్న ఓ వ్యక్తి మరణించడం ఇప్పుడు దేశంలో కొత్త ఆందోళనకు తావిస్తుంది..! వివరాల్లోకి వెళ్తే..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కి చెందిన దీపక్ మారబి అనే 42 ఏళ్ళ వ్యక్తి డిసెంబర్ 12 న భారత్ బయోటెక్ విడుదల చేసిన “కోవాక్సిన్” క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. మూడోదశ టీకా వేయించుకున్నారు. ఆయన డిసెంబర్ 21 న మరణించారు. ఆయన మరణంపై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు కలుగుతున్నాయి. “వాక్సిన్ తేడా కొట్టి దీపక్ చనిపోయారు” అంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ భారత్ బియోటెక్ ప్రతినిధులు మాత్రం “దీపక్ లో గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అతని శరీరంలో విష పూరితమైన పదార్ధం ఉండడం వలనే మరణించారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. నిజాలు తెలుస్తాయి” అంటూ ప్రకటన విడుదల చేసారు. ఈ మరణంపై పీపుల్స్ మెడికల్ కాలేజీ ప్రతినిధి రాజేష్ కపూర్ కూడా భిన్నంగా స్పందించారు. “అతని మరణంపై పోస్ట్ మార్టం నివేదికలు పరిశీలిస్తున్నాం. టీకా వలన చనిపోయారు అనడానికి ఆధారాలు లేవు. అతని దేహానికి మళ్ళీ వెస్కార పరీక్ష చేస్తాం” అన్నారు. ఈ అంశం ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో సంచలనంగా మారింది అంటూ పీటీఐ కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించేందుకు మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అందుబాటులో లేరు అంటూ పీటీఐ కథనంలో చెప్పింది.

అనుమానాలు మొదటి నుండీ..!!

కరోనా వాక్సిన్ పై అనుమానాలు ఇప్పుడే కొత్త కాదు. రెండు నెలల కిందట కూడా సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ఓ యువకుడికి తేడా కొట్టింది. తల నొప్పి, వాంతులుతో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పై వాళ్ళు అనేక ఆరోపణలు చేసారు. దీంతో సీరం కూడా ఘాటుగా స్పందించి అతనిపై పరువు నష్టం దావా వేసింది. తాజాగా ఇప్పుడు భారత్ బియోటెక్ టీకాపై అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఈ రెండు టీకాల పట్ల ఇలా అనుమానాలు ఉండగానే.. ఈ నెల 16 న దేశీయంగా మొత్తం విడుదలకు కేంద్రం సిద్ధమవుతోంది..!!

 

author avatar
Srinivas Manem

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N