NewsOrbit
న్యూస్

సబ్‌వే ట్రైన్ ఈడ్చుకెళ్లిపోయింది!

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మ్యాన్హటన్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ కోసం 7ట్రైన్ స్టాప్ వద్ద నిల్చున్న ఓ వ్యక్తికి సంబంధించిన వస్త్రాలు రైల్లో ఇరుక్కుపోవడంతో ట్రైన్ అతడ్ని ఈడ్చుకెళ్లింది. దీంతో అతడు టన్నెల్‌లో పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సబ్‌వే ప్లాట్‌ఫాం చివరలో ఓ వ్యక్తి నిల్చున్నాడని, అంతలోనే వచ్చిన ట్రైన్.. అతడ్ని ఈడ్చుకెళ్లిందని తెలిపారు. అతడు వేసుకున్న దుస్తులు ట్రైన్‌లో ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు.

మంగళవారం రాత్రి 7.20గంటలకు ఈ ఘటన జరిగిందని, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. మృతుడి వయస్సు 39ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. అయితే, తీవ్రగాయాలపాలైన అతడ్ని అక్కడివారు ఎవరూ గుర్తించలేకపోయారని తెలిపారు.

ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు, రైల్వే అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో రద్దీ కూడా లేదని చెప్పారు. రైలు కదులుతున్న సమయంలో బాధితుడు ఎక్కేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే అతడు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు.

ట్రైన్ లాక్కెళ్లడంతో అతడి శరీరం ఎలక్ట్రిక్ బాక్సులో ఇరుక్కుపోయిందని, ఫ్లాష్ రావడంతో ప్రమాదాన్ని ట్రైన్ ఆపరేటర్లు గుర్తించారని మరో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైందని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. 2016లో 48మంది ప్రయాణికులు ట్రైన్, ప్లాట్‌ఫాంకి మధ్య ఇరుక్కుపోయి తీవ్రగాయాలపాలయ్యారు.

author avatar
Siva Prasad

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Leave a Comment