టెక్సాస్: ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా ఒక్క పామును చూస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంది. పొరపాటున ఇంటి ప్రాంగణంలోకి పాము వస్తే వెంటనే స్నేక్ హెల్ప్ సభ్యులకు ఫోన్లు చేసి, దాన్ని పట్టించి గానీ ప్రశాంతంగా ఉండలేం. కానీ అలాంటిది అమెరికాలోని ఒక ఇంటి కింద ఏకంగా 45 అత్యంత విషపూరితమైన తాచుపాములున్నాయి. అవన్నీ అక్కడే నివాసం ఉంటున్నాయి. గత బుధవారం ఒకసారి ఏదో కేబుల్ చెక్ చేద్దామని కిందకు వెళ్లినపుడు.. అక్కడ కొన్ని తాచుపాములు ఉండటాన్ని ఆయన గమనించారు. దాంతో బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్ అనే సంస్థకు ఫోన్ చేసి, వాటిని తీసేయమని చెప్పారు.
https://www.facebook.com/Bigcountrysnakes/videos/612711535870730/
తాము మధ్యాహ్నం అక్కడకు వెళ్లామని, కింద జాగ్రత్తగా చూస్తే ఏవో కొన్ని ఉన్నాయనుకున్నానని సంస్థ సభ్యుడొకరు ఫేస్ బుక్ లో రాశారు. కానీ వాటిని తీస్తున్న కొద్దీ ఇంకా వస్తున్నాయని.. అలా చాలా ఉన్నాయని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. దాన్ని ఇప్పటికి దాదాపు 15 లక్షల మందికి పైగా చూశారు. ఇక ఆ ఇంటిని తగలబెట్టాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. మరొకరైతే, పాములు తీస్తుంటేనే తనకు చాలా భయం వేసిందని, అంత ధైర్యంగా ఎలా తీయగలిగారని అడిగారు. తనకైతే అక్కడకు వెళ్లి, పాములు చూసిన తర్వాత మళ్లీ ఇంటికెళ్లాలంటే మానసిక చికిత్స అవసరం అయ్యేదని, అద్భుతంగా చేశారని మరొకరు వ్యాఖ్యానించారు. తర్వాత మొత్తం తాచుపాములన్నింటినీ తీసేసి, వేరే చోట వదిలిపెట్టారు.
జనావాసాలకు దూరంగా.. మనుషులు, పశువులు ఏమీ లేనిచోట వాటిని వదిలేందుకు తమకు అనుమతి ఉందని బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్ తెలిపింది. అక్కడ తాము వాటి ప్రవర్తన, పిల్లలు బతుకుతున్న తీరు, సామాజిక సంబంధాల లాంటి అంశాలను పరిశీలిస్తామన్నారు. టెక్సాస్ నగరంలో గత డిసెంబరులో ఒక వ్యక్తి తన కారు షెడ్డులో 30 తాచుపాములను గమనించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?