NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దారుణం.. సొంత తమ్ముడి ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ డేటా..!

ఇంట‌ర్నెట్ రాక‌తో ప్ర‌పంచం న‌ట్టింట్లోకి వ‌చ్చింది. న‌ట్టింటిని కూడా అర చేతిలోకి తెచ్చిన గొప్ప సాధ‌నం మొబైల్. ఇప్పుడు ఈ రెండింటిని విడ‌దీసి చెప్ప‌లేమేమో.. మొబైల్ ఉందంటే అందులో డాటా బ్యాల‌న్స్ ఉండాల్సిందే. అలా కాకుండా డాటా లేకుండా మొబైల్ ఉంటే అది ఉన్నా.. లేకున్న‌ట్లే. అందుకే డాటా ఎక్కువ‌గా వ‌చ్చే సిమ్ కార్డును వాడేందుకు అంద‌రూ ఇష్ట‌ప‌డుతారు. అయితే.. ఎక్క‌డో ఉన్న వారితో మాట్లాడ‌డానికి ఉప‌యోగ ప‌డుతుంది అనుకున్న ఇంట‌ర్నెట్ ఇప్పుడు కొత్త రూపం దాల్చింది.

ఇంట‌ర్నెట్ వాడ‌కంతో ఎన్నో విష‌యాలు తెలిసే మాట అటు ఉంచితే.. అది ఇప్పుడు చాలా మందికి వ్య‌స‌నంగా మారిపోయింది. మొబైల్ లేకుండా ఒక్క క్ష‌ణం ఉండ‌లేక‌పోతున్నారు. స్నేహితులు, బందువులు ఎవ‌రున్నా.. లేకున్నా.. మొబైల్ చేతిలో ఉండాల్సిందే.. అందులో మొబైల్ డాటా ఉండాల్సిందే. అలా లేక‌పోతే.. ఎంత దూర‌మైనా పోయి వేయించుకోవాల్సిందే. డబ్బులు లేక‌పోతే గొడ‌వ‌ల‌కు దిగాల్సిందే అన్నట్లు మారింది నేటి యువ‌కుల తీరు.

ఏది ఏమైనా ఫోన్ అర‌చేతిలో ఉండాలి. అలా ఉండ‌క‌పోతే.. కోపం త‌న్నుకుంటూ వ‌చ్చేస్తుంది. అందుకే దీనిమీద ప‌లువురు డాక్ట‌ర్లు మాట్లాడుతూ.. ఎక్కువ‌గా మొబైల్ వాడితే అదో వ్య‌స‌నం అని దానితో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెబుతునే ఉన్నారు. కానీ నేడు మొబైల్ వాడ‌కం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. అది లేక‌పోతే.. ఏదీ చేయాల‌నిపించ‌ని స్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు.

అయితే అలా పోయిన స్థితిలో ఎన్నో నేరాలు కూడా చేస్తున్నారు. సొంత కుటుంబ స‌భ్యుల‌తో పోట్లాడి ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే మ‌ళ్లీ ఒక‌టి రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లోనూ జ‌రిగింది. త‌న మొబైల్‌ డాటాను అయిపోగొట్టినందుకు గొడ‌వ ప‌డ‌ట‌మే కాకుండా త‌మ్ముడి ప్రాణాల‌ను తీశాడు ఒక ప్ర‌బుద్ధుడు.

జోధ్‌పూర్‌లో నివాస‌ముండే రామ‌న్‌, రాయ్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు అన్నాద‌మ్ములు. పోయిన‌ బుధ‌వారం రాయ్ (23)‌, అన్న రామ‌న్‌కు తెలియ‌కుండా అత‌ని ఫోన్ లోని మొబైల్ డాటాను పూర్తిగా అయిపోగొట్టాడు. దాంతో విష‌యం తెలుసుకున్న రామ‌న్ త‌మ్ముడి మీద కోపంతో గొడ‌వ‌కు దిగాడు. చివ‌ర‌కు త‌న త‌మ్ముడిని బిల్డింగ్ మీద‌కు తీసుకుపోయి క‌త్తితో ఛాతీలో నాలుగైదుసార్లు పొడిచాడు. దాంతోరాయ్ కు తీవ్రంగా రక్త‌స్రావం అయ్యింది.

దీన్ని చూసిని రామ‌న్ అక్క‌డి నుంచి పారిపోయాడు. కొద్దిసేప‌టికి కుటుంబ స‌భ్యులు చూసి అత‌న్ని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అను మృతి చెందిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు. దీంతో విష‌యం తెలుసుకున్న పోలీసులు రామ‌న్ కోసం గాలిస్తున్నారు. దీనిపై కేసు నమొదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju