నటసామ్రాట్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలియని వారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండరేమో.. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా, ఇంకా మంచి యాక్టర్ గా పలు చిత్రాల్లో నట్టించారు. అదే కాకుండా బుల్లితెరలో హోస్ట్ గా పలు ప్రోగ్రాంలు చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అలాగే ఏ సినీ ఫంక్షన్ అయిన కానీ తన ఇంగ్లిష్ తో అందరినీ నవ్విస్తుంటుంది. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించక పోయినా కానీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ దర్శణమిస్తూనే ఉంటుంది.
తండ్రికి తగ్గ కూతురుగా మంచు లక్ష్మికి పేరు ఉంది. సినిమాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా భారీ డైలగులను మంచు లక్ష్మి అలవోకగా చెప్పేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లక్ష్మి దీపావళి సందర్భంగా పలు విషయాలను తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ మీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో మంచు లక్ష్మి తన ఇంటిని చూపించింది. ఆ ఇల్లు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంది. ఇంటి లోపలికి పోగానే అన్ని ఆధునిక అంగులతో ఫర్నిచర్, ఇంకా వర్కౌట్లు చేసేందుకు ఏర్పాటు చేసిన రూమ్.. ఎంతో బాగున్నాయి. సూర్యోదయాన్ని ఆస్వాదించేలా బాల్కనీ ఉంది. పూలు చెట్లతో కూడిన అందమైన గార్డెన్ ఉంది. ఇలా అన్ని అంగులతో ఉన్న మంచు లక్ష్మి ఇల్లు నెటిజన్లను అకట్టుకుంటుంది.
అయితే మంచు లక్ష్మి తన కుటుంబ సభ్యులతో ఈ దీపావళిని ఇటివల జరుపుకున్నారు. ఒకరోజు ముందే మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి తన ఇంటి ఆవరణాన్ని చూపిస్తూ ఈ వీడియోను తీశారు. ఇందులో ఇదివరకూ ఎప్పుడు షేర్ చేయని తన నివాసాన్ని చూపించారు. అలాగే తనకు సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది మంచు లక్ష్మి. మీరు కూడా చూడాలనుకుంటే ఒక లుక్ వేయండి.