Maa Elections: నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..!!

Share

Maa Elections: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ ఛానల్ తో.. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు విషయంపై మంచు విష్ణు స్పందించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలనీ తప్పు పట్టారు. కచ్చితంగా ఎన్నికలలో గెలుస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి తమ బంధువా కాదా అనేది ఆయనే రుజువు చేయాలని.. నాగబాబు చేసిన ఆరోపణలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మా ఫ్యామిలీ గురించి నాకంటే ఎక్కువగా నాగబాబు అంకుల్ కి ఎక్కువగా తెలుసని చెప్పుకొచ్చారు.

Prakash Raj and Vishnu Play Their Cards Well

300 మందిని ఆహ్వానిస్తే చివరాకరికి 500 మంది వచ్చారు 

ఇదే తరుణంలో అపోజిషన్ లో ఉన్న వ్యక్తి తన ఫ్యామిలీ పై అనేక ఆరోపణలు.. విమర్శలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. త్వరలోనే ఆయన కి తానేంటో చూపిస్తానని అంటూ సవాల్ విసిరారు. నిజంగా నేను చేసేది తప్పు అయితే నన్ను ఎన్నికల అధికారి సస్పెండ్ చేయొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి.. 300 మందిని ఆహ్వానిస్తే చివరాకరికి ఐదు వందల కంటే ఎక్కువ మంది వచ్చారు అని.. వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా విజయం తమదేనని పేర్కొన్నారు.

MAA Press Meet LIVE | Movie Artist Association | TFPC - YouTube

సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ

పైగా వచ్చిన వాళ్ళు చాలా వరకు మా అసోసియేషన్ సభ్యులు అని కూడా విష్ణు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మా ఎన్నికలలో తనకు ఎందుకు ఓటు వేయాలో స్పష్టంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పటం జరిగిందని, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా సభ్యులు.. కూడా విమానాల్లో వచ్చి మరీ ఓటు వేస్తారని.. విష్ణు పేర్కొన్నారు. ఆ తరువాత నరేష్ మాట్లాడుతూ… రేపు ఉదయం 8 గంటల నుండి.. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ప్రారంభమయ్యే నాలుగైదు గంటల్లో మొత్తం పూర్తవుతుంది అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ.. మా అసోసియేషన్ సభ్యులు ఎన్నికలలో పాల్గొని ఓటు వేయాలని తెలిపారు.


Share

Related posts

నారి నారి నడుమ మురారి…

Siva Prasad

క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి అంతా సిద్దం ..!

GRK

Ys Jagan : ఏకగ్రీవాల రికార్డ్ కొడదాం అని ప్లాన్ చేసిన జగన్ కి ఆఖరి నిమిషం లో బాంబు పేల్చిన నిమ్మగడ్డ ? 

sekhar