మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదలవుతోంది. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు, టీజర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా నవీన్ చంద్ర బర్త్‌డేని పురస్కరించుకొని ఆయనకు విషెస్ తెలియజేస్తూ, ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు చిత్ర బృందం.
ఇక ఈ చిత్రంలో సిద్ అనే పాత్రను పోషిస్తున్న నవీన్ చంద్ర ఇంటెన్స్ లుక్స్‌తో, మాస్ అప్పీల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన కనిపిస్తుండటంతో ఈ చిత్రం పై అంచనాలు తారాస్దాయికి చేరుకుంటున్నాయట. అంతే కాకుండా ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ మూవీ లో కీలక పాత్ర పొషిస్తుండటం విశేషం. ఇక విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, ఆయన జోడీగా రుహీ సింగ్ నటిస్తుంది. ఇకపోతే చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో నిర్మిస్తున్న ‘మోసగాళ్లు’ మూవీని మంచు విష్ణు భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు.
దీంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ అమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఇక అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. కానీ సపోర్టింగ్ రోల్స్ తో పాటుగా అరవింద సమేత .. ఎవరు లాంటి సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు. కాగా ఇప్పుడు మోసగాళ్ళు సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు.