MAA Poll: అక్టోబర్ 10వ తారీకు మా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ వాతావరణాన్ని కి మించి.. “మా” అధ్యక్ష ఎన్నికల కవరింగ్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ అదే విధంగా మంచు విష్ణు ల మధ్య మాటల తోటలు భారీగా గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉండగా.. మంచు విష్ణుకి బాలయ్య బాబుతో పాటు మరికొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా మంచు విష్ణు తన మేనిఫెస్టో వివరాలు ప్రకటించారు.
బాలయ్య బాబు సహకారంతో “మా” భవనం
ఆ విషయాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. తన మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చాడు మంచు విష్ణు. వాటిలో ప్రధానంగా చూసుకుంటే ఆర్టిస్టుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఓటిటి.. యూట్యూబ్ వంటివాటిల్లో కొత్త టాలెంట్ నీ.. ప్రోత్సహిస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా నందమూరి బాలయ్య బాబు సహకారంతో “మా” భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన ప్రతి ఆర్టిస్ట్ కి ఇల్లు కడతామని హామీ ఇచ్చారు.
మహిళలకు భద్రత
నిరుపేదల కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు అందిస్తామని…మా ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆరోగ్య బీమా కూడా “మా” సభ్యుడికి కల్పిస్తామని చెప్పుకొచ్చారు. “మా” సభ్యుల పిల్లలకు వారి చదువులకు సంబంధించి ఆర్థిక సాయం కూడా చేస్తామని తెలిపారు. మహిళలకు భద్రత కల్పించే రీతిలో కూడా మంచు విష్ణు హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే మా అసోసియేషన్ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడంతోపాటు వారి పిల్లల పెళ్లిళ్లకు అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా సాయం చేసే రీతిగా తన మేనిఫెస్టో అందించడంతో.. మంచు విష్ణు మేనిఫెస్టో ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.