Bhanumati: మంగమ్మగారి మనవడు భానుమతి గారు చేయకపోతే బాలయ్యకి హిట్ దక్కేది కాదా..?

Share

Bhanumati: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ హిట్ సినిమా అంటే శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులోనే అంటే 1974లో తండ్రి ఎన్.టి.ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల సినిమా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో సహాయనటుడిగా నటించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించాడు. హీరో కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వంలో నటించాడు.

mangammagaari manavadu is hit because of bhanumati-
mangammagaari manavadu is hit because of bhanumati-

ఇక బాలకృష్ణ హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఒక మాదిరి హిట్స్ అందుకుంటున్నాడే తప్ప మంచి కమర్షియల్ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ క్రమంలో అప్పటికే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి ఇండస్ట్రీ హిట్స్ తీసిన కోడి రామకృష్ణ – ప్రముఖ నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో మంగమ్మగారి మనవడు సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో బాలయ్యకి బామ్మగా ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఈ పాత్ర చుట్టు కథ కీలకంగా తిరుగుతుంది. కానీ అప్పట్లో ఈ పాత్రకి ఎవరిని ఎంచుకోవాలో అని దర్శక, నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు.

Bhanumati: ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి వారే కొన్నిసార్లు తగ్గేవారు.

ఆ సమయంలో దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాతకి మంగమ్మ పాత్రకి సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ గారైతే బావుంటుందని తన మనసులోని మాటను బయటకి చెప్పారు. అయితే ఆమెని చూసి కొన్ని సందర్భాలలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి వారే కొన్నిసార్లు తగ్గేవారు. అంత గొప్ప నటీమణి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు. అందుకే ఆవిడతో సినిమా అంటే మేకర్స్ కాస్త భయపడేవారు. అందుకే ఆమెని మంగమ్మగారి మనవడు సినిమాలో ప్రధాన పాత్రకి తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు.

మొత్తానికి ధైర్యం చేసి దర్శకుడు కోడి రామకృష్ణ వెళ్ళి భానుమతిగారిని కలిసి కథ చెప్తానని చెప్పారు. ఆవిడ కొత్త కుర్రాడివి నాతో సినిమా చేస్తావా..అని అడిగారట. ఆయన ఒక్కసారి మీరు కథ వినండి నచ్చకపోతే వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేసి కథ వినడానికి ఒప్పించారు. అలా మంగమ్మగారి మనవడు కథ మొత్తం విన్న భానుమతి గారు..నాకు కథ నచ్చింది..ఇందులో నా పాత్ర కూడా చాలా బావుంది ..ఇంతకీ హీరో ఎవరని అడిగారట భానుమతి గారు. ఎన్.టి.ఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ అని చెప్పారు కోడి రామకృష్ణ.

Bhanumati: డైరెక్టరూ..సీన్ ఏంటి అని అడిగారు భానుమతి

చిన్న పిల్లాడు అప్పుడే  అంత పెద్ద హీరో అయ్యాడా అని నవ్వుకొని సరే అని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా సినిమా మొదలైంది. అయితే మొదటిరోజు భానుమతిగారి మీద సీన్ చేయాలి అంతా రెడీ. డైరెక్టరూ..సీన్ ఏంటి అని అడిగారు భానుమతి. అప్పుడు ఇందులో ఉన్న ఒక డైలాగ్ చెప్పి సీన్ ఏంటీ చెప్పాడు. ఆ డైలాగ్ విని కసూ బుస్సులాడారు. ఇలాంటి డైలాగ్స్ ఉంటాయని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ఇంతెత్తున ఎగిరారు. కానీ కోడి రామకృష్ణ నెమ్మదిగా బ్రతిమాలి మీకు చాలా బావుంటుంది. ఒక్కసారి చూద్దాం. బాగోలేదని ఎవరైనా చెబితే తీసేద్దాం అని ఒప్పించాడు.

అలా మొదటి డైలాగ్ షూట్ చేశారు. భానుమతిగారి స్టైల్లో డైలాగ్ చెప్పి అదరగొట్టారు. ఇలా డైలాగ్ పూర్తైందో లేదో చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు. అది భానుమతిగారికి బాగా అనిపించింది. దాంతో నిజంగా అంత బావుందా అని అడిగారు..ఈ ఒక్క డైలాగే కాదమ్మ..అన్నీ డైలాగులు మీరు చెప్తే థియేటర్స్‌లో జనాల చప్పట్లతో మార్మోగిపోతుందని చెప్పాడు. అనుకున్నట్టుగానే మంగమ్మగారి మనవడు సినిమా బ్లాక్ బస్టర్ అయి బాలకృష్ణ కెరీర్‌లోనే మొదటి సూపర్ హిట్‌గా నిలిచింది.


Share

Related posts

Regina Cassandraa Beautiful Clicks

Gallery Desk

అతన్ని చూస్తే పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు మీరంతా .. ఆగండి .. అతనిప్పుడు హీరో !

GRK

Wamiqa Gabbi New Photos

Gallery Desk