Mangli : మంగ్లీ Mangli గురించి తెలుసు కదా. తను ప్రస్తుతం ఎంత పెద్ద సింగరో అందరికీ తెలుసు. జానపద గేయాలు పాడాలంటే మంగ్లీ తర్వాతనే ఎవ్వరైనా. అది మంగ్లీ రేంజ్. మంగ్లీ పాట పాడితే చాలు.. ఆ ఊపే వేరు. తన వాయిస్ ఎంత మధురంగా ఉంటుందంటే.. తను పాట పాడుతుంటే.. అలాగే వింటూ కూర్చోవాలని అనిపిస్తుంటుంది. అది మంగ్లీ వాయిస్ కు ఉన్న పవర్. అందుకే.. జానపద గేయాల నుంచి సినిమాల పాటలు పాడే స్థాయికి ఎదిగింది మంగ్లీ.

ఇటీవలే లవ్ స్టోరీ సినిమాలో సారంగ దరియా పాటను పాడి అదరగొట్టేసింది. ఆ పాటకు ప్రస్తుతం ఫుల్ టు రెస్పాన్స్ వస్తోంది. సారంగదరియా అనే జానపద గేయాన్ని సుద్దాల అశోక్ తేజ తనదైన శైలిలో రచించారు. ఆ పాటను మంగ్లీతో పాడించడంతో ఆ పాటకు మరింత అందం వచ్చింది.
Mangli : శివరాత్రి పాటను పాడిన మంగ్లీ
తాజాగా సింగర్ మంగ్లీ శివరాత్రి పాటను పాడింది. తనకు మంగ్లీ అఫిషియల్ అనే ఓ యూట్యూబ్ చానెల్ ఉన్న విషయం తెలిసిందే కదా. ఆ చానెల్ లోనే శివరాత్రి పాటను పాడింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఫుల్ వీడియో ఇంకా విడుదల కాలేదు. ప్రోమోకే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రోమోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక.. ఫుల్ వీడియో విడుదలైతే యూట్యూబ్ లో సంచలనాలే.