న్యూస్

Tripura: త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా

Share

Tripura: త్రిపుర నూతన సీఎంగా బీజేపీ ఎంపి మాణిక్ సాహా ఎంపికైయ్యారు. సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్ సాహాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. మాణిక్ సాహా బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షుడుగా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. త్రిపుర నూతన సీఎం మాణిక్ సాహా అని బీజేపి సెంట్రల్ పరిశీలకుడు, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాజీనామా చేసిన తరువాత సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తనకు కేంద్ర నాయకత్వం ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేశారు. త్రిపుర రాజధాని అగర్తాలలోని బీజేపీ కార్యాలయంలో సీఎం పదవికి రాజీనామా చేసిన బిప్లవ్ కుమార్ దేవ్ ను మాణిక్ సాహా తదితరులు సత్కరించారు. నూతన సీఎంగా ఎంపికైన మాణిక్ సాహాను పలువురు నేతలు అభినందించారు.

Tripura: బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో

వచ్చే సంవత్సరం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాలతో సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బిప్లవ్ కుమార్ రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే బీజేఎల్పీ సమావేశంలో మాణిక్ సాహాను పార్టీ ఎమ్మెల్యేలు నూతన సీఎంగా ఎన్నుకోవడం గమనార్హం. తొలుత ఈ రాత్రి 8 గంటలకు ఎల్పీ సమావేశం నిర్వహించి నూతన సీఎంను ఎన్నుకుంటారని కేంద్ర పరిశీలకుడు భూపేందర్ యాదవ్ తెలియజేసినా ముందుగానే సీఎం ఎంపిక కార్యక్రమం జరిగింది.


Share

Related posts

Financial Problems : మీకున్న ఆర్ధిక సమస్యలు తగ్గి అభివృద్ధి లోకి రావాలంటే ఈ ఒక్క పని చేయండి !!మార్పు మీకే తెలుస్తుంది!!

siddhu

Big Breaking : కరోనా టీకా వేయించుకున్న జగన్ దంపతులు..

bharani jella

Delhi : రైతుల ఉద్యమంతో అట్టుడుకుతున్న దేశ రాజధాని..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar