Mansas Trust: అశోక్ గజపతి రాజు పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Share

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఈవో తనకు సహకరించడం లేదని ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవో వ్యవహార శైలిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ట్రస్ట్ ను పరిశీలించేందుకు వెళ్లిన చైర్మన్ అశోక్ గజపతిరాజుకు ఇఓ వెంకటేశ్వరరావు సహకరించలేదు. ఉద్యోగులకు జీతాల విషయంలోనూ వెంకటేశ్వరరావు జోక్యం చేసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చైర్మన్ అశోక్ గజపతిరాజు సూచించినా ఇఓ పట్టించుకోకపోగా ట్రస్ట్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. జీతాల కోసం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తే వారిపై ఇఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం విచారణ జరిపింది.

Mansas Trust issue in ap high court
Mansas Trust issue in ap high court

ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ట్రస్ట్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న ఇన్ స్టిట్యూషన్స్ వ్యవహారాల్లో ఇఓ జోక్యం చేసుకోవద్దని ఇఓకు ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఇఓ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను కూడా కోర్టు సస్పెండ్ చేసింది. ట్రస్ట్ చైర్మన్ ఇచ్చే ఆదేశాలను ఇఓ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. స్టేట్ అడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి ఏర్పాటు జిఓ 75పై కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఆడిట్ పేరిట ఎవరెవరో వస్తున్నారని సీనియర్ న్యాయవాది జీవి సీతారామమూర్తి, న్యాయవాది అశ్వినీ కుమార్ లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆడిట్ తో ఇఓ కు సంబంధం లేదనీ న్యాయస్థానం స్పష్టం చేసింది. స్టేట్ ఆడిట్, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ మాత్రమే మాన్సాస్ ఆడిట్ చేయాలని సూచించింది. మాన్సాస్ ట్రస్ట్ ఇఓకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.


Share

Related posts

SLEEPING: రాత్రి పూట ప్రశాంతంగా పడుకోవాలనుంటే ఇలా ఈ టిప్స్ పాటిస్తే సరి. !

Ram

Tirupati by poll : పవన్ రాను అన్నాడా..? బిజెపి వద్దు అనిందా?

siddhu

టీడీపీ కార్యకర్తగా మారిపోయారు..! నిమ్మగడ్డపై వైసీపీ ముప్పేట దాడి..!!

Srinivas Manem