NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Kalyana Lakshmi Scam : ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ ..అమాయకుడి హత్య!కల్యాణలక్ష్మి స్కాంలో అనేక మలుపులు!తెల్లబోతున్న తెలంగాణ!!

Kalyana Lakshmi Scam : ఆదిలాబాద్​ జిల్లాలో కల్యాణలక్ష్మి డబ్బులు కాజేసేందుకు అక్రమార్కులు ఏకంగా ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేశారు. గ్రామ కార్యదర్శి నుంచి ఎమ్మెల్యే వరకు అందరి సంతకాలనూ ఇచ్చోడ మీసేవా కేంద్రంలోనే కాపీ కొట్టిసాక్షాత్తు అడ్డదారిలో రూ. కోట్లు మింగేశారు. ఈ కేసును  ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్​రెడ్డికి  అప్పజెప్పగా ఆయన దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. మరో రెండురోజుల్లో పై ఆఫీసర్లకు రిపోర్ట్​ అందించనున్నట్లు తెలుస్తోంది.

Many twists in Kalyana Lakshmi scam!
Many twists in Kalyana Lakshmi scam!

హత్యతో వెలుగులోకొచ్చిన కుంభకోణం!

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని మీసేవా సెంటర్​ కేంద్రంగా కల్యాణలక్ష్మిలో జరిగిన అక్రమాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్​ ముమ్మరం చేశారు. రెండు నెలల క్రితం సిరికొండ మండలం పొన్నాకు చెందిన జ్ఞానేశ్వర్ హత్య తో ఈ విషయం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఉట్నూర్​ డీఎస్పీ ఉదయ్​రెడ్డి దర్యాప్తులో వివిధ కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫీసర్లు, మీసేవా నిర్వాహకులు కలిసి ఏకంగా 128 మంది పేర్లపై కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ స్కీముల కింద సొమ్ము స్వాహా చేసినట్లు తేలింది.   కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీంలే కాకుండా ఇచ్చోడ మీ సేవా సెంటర్​ కేంద్రంగా అనేక అక్రమాలు జరిగినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. వ్యవసాయ భూములు లేకున్నా  ఉన్నట్లు  సృష్టించడం, టైటిల్, పాస్ బుక్​ల తయారీ, ఆఫీసర్లతో కుమ్మక్కై లోన్లు మంజూరు చేయించుకోవడం ఇక్కడ సర్వసాధారణమని తెలుస్తోంది.  ఈ మొత్తం వ్యవహారంలో మీ సేవా సెంటర్​ నిర్వాహకులతోపాటు  వివిధ ఉద్యోగుల పాత్రపైనా రిపోర్ట్​రెడీ చేసిన డీఎస్పీ ఉదయ్​రెడ్డి ఒకటి రెండు రోజుల్లో పై ఆఫీసర్లకు నివేదించనున్నట్లు సమాచారం. దాని ప్రకారం బాధ్యులైన ఆఫీసర్లు, ఉద్యోగులపైనా చర్యలు ఉంటాయనే చర్చనడుస్తోంది.

డీఎస్పీ ఏం చెప్పారంటే?

మీ సేవా నిర్వాహకులు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ ఇన్వెస్టిగేషన్​లో తేలిందని డీఎస్పీ ఉదయ్ తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆఫీసర్ల అటెస్టేషన్​ను మీ సేవా సెంటర్​లోనే చేశారని చెప్పారు.బోథ్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్​కు తెలియకుండానే ఏడుగురికి  కల్యాణలక్ష్మి సాంక్షన్​ అయిందని, గతంలో ఎమ్మెల్యే  చేసిన సంతకాన్ని స్కాన్ చేసి పెట్టుకున్న మీ సేవా నిర్వాహకులు కొత్త అప్లికేషన్లపై పేస్ట్​ చేసి కథ నడిపించారని,ఆ తర్వాత ఫైల్ ను పద్ధతి ప్రకారం మూవ్​చేసి  డబ్బులు లేపేశారని ఆయన వివరించారు.ఒకరి హత్యకు ఈ కుంభకోణానికి కూడా సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు దర్యాప్తులో తేలిన అంశాలతో పై ఆఫీసర్లకు రిపోర్ట్​ పంపిస్తామని డీఎస్పీ తెలిపారు.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju