Maoist Top Leader RK: ఆర్కే మృతిపై అనుమానాలకు తెర..! క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ..!!

Share

Maoist Top Leader RK: మావోయిస్ట అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో మృతి చెందారా లేదా అన్న విషయంలో వస్తున్న అనుమానాలకు తెరపడింది. మావోయిస్టు పార్టీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఆర్కే అనారోగ్యంతో చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర పోలీసులు, డీజీపీ దృవీకరిస్తున్నా ఆర్కే భార్య, ఆయన తోడల్లుడు, విరసం నేత కల్యాణ్ రావులు నమ్మడం లేదు. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన మావోయిస్టు పార్టీ ముందుగా ఎటువంటి స్టేట్ మెంట్ రిలీజ్ చేయలేదు. దీంతో ఆర్కే మృతిపై అనుమానాలు చెలరేగాయి. గతంలోనూ పలు మార్లు ఆర్కే మృతి చెందాడని వదంతులు వచ్చాయి.

Maoist Top Leader RK death confirmed by maoist leaders
Maoist Top Leader RK death confirmed by maoist leaders

 

Maoist Top Leader RK: ఆర్కే మృతిపై లేఖ విడుదల చేసిన మావోయిస్టు కమిటీ

దీంతో ఇప్పుడు కూడా తప్పుడు సమాచారం అయి ఉంటుందని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. ఆర్కే మృతిపై తమకు నమ్మకం కుదరడం లేదని ఆయన భార్య శిరీష్ అన్నారు. మవోయిస్టు పార్టీ నుండి అధికారిక ప్రకటన వస్తేనే నమ్ముతామని అంటున్నారు. ఒక వేళ ఆర్కే చనిపోయి ఉంటే మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఒక వేళ ఆర్కే చనిపోయి ఉంటే మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుందని అలా జరగలేదు కాబట్టి తాము నమ్మడం లేదని తొలుత ఆర్కే కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే తాజాగా ఆర్కే మృతిని మావోయిస్టు పార్టీ దృవీకరించింది. ఈ మేరకు కేేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది.

నిన్న ఉదయం ఆర్కే మృతి

ఈ నెల 14న ఉదయం 6 గంటలకు ఆయన చనిపోయినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. చికిత్స చేసినా ఆర్కేను కాపాడలేకపోయామన్నారు. విప్లవ శ్రేణుల మధ్యే అంత్యక్రియలు జరిగినట్లు పార్టీ స్పష్టం చేసింది. ఆర్కే మృతి వార్త తెలియడంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అడవి చుట్టూ పోలీసులను చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారనీ, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆర్కే భార్య శిరీష ఆరోపించారు. ఆర్కే ప్రజల కోసం పోరాడిన గొప్ప యోధుడనీ ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆర్కేకు జోహార్లు అర్పిస్తూ ప్రజల కోసం జీవించిన మనిషికి వీరుల మధ్య అంత్యక్రియలు జరిగాయని శిరీష పేర్కొన్నారు. ఆర్కే ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని విరసం నేత కళ్యాణ్ రావు అన్నారు.


Share

Related posts

ట్రంప్ కోటను కూల్చినట్టేనా..!? అమెరికా ఎన్నికలు ఎటువైపు..!?

Srinivas Manem

Maha Samudram : మహాసముద్రం నుంచి సిద్ధార్థ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది..!!

bharani jella

Sanchaita Gajapati Raju: నా పదవినే ఊడగొడతావా..! చిన్నాన్న మీద సంచయిత అధ్భుత రివేంజ్..?

somaraju sharma