Maruthi : మారుతి గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా అంటే అందరూ పక్కా కామెడీ సినిమా ని తీసుకు వస్తారని అందరూ చెప్పుకున్నారు. కానీ మారుతి.. గోపీచంద్ కోసం పక్కా కమర్షియల్ సినిమా ని తీయబోతున్నాడని తాజాగా పక్కా కమర్షియల్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మారుతి గత చిత్రం ప్రతీరోజూ పండుగే సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి పలువురు స్టార్ హీరోలతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఎట్టకేలకి గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు.
ఇక ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. టైటిల్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. పక్కా కమర్షియల్ అన్న టైటిల్ గోపీచంద్ కి బాగా సూటయ్యే టైటిల్ అని టైటిల్ లోనే సినిమా ఎలా ఉంటుందో మేకర్స్ హింట్ ఇచ్చారని తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్- యువి వంశీ నిర్మాతలుగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జీఏ2 – యూవి క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి సినిమా నిర్మిస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి.
Maruthi : మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్..!
ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్.. గోపీచంద్ మార్క్ యాక్షన్ కలిసి ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమాగా రూపొందబోతోందని సమాచారం. రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. కాగా గోపీచంద్ నటించిన సీటీమార్ ఏప్రిల్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ లో వరుసగా సినిమాలు చేసే గోపిచంద్ జీఏ2లో మొదటిసారి సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక గతకొంతకాలంగా గోపీచంద్ కి సక్సస్ లు లేక రేస్ లో వెనకపడిన సంగతి తెలిసిందే