(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశంలో కార్ల మార్కెట్ మందగమనం ఇంకా అలానే ఉంది. అత్యధికంగా కార్లు ఉత్పత్తి చేసే మారుతి సంస్థ వరసగా ఎనిమిదవ నెల కార్ల ఉత్పత్తి తగ్గించింది. గత సంవత్సరం అక్టోబర్లో 1,50497 కార్లు ఉత్పత్తి చేసిన మారుతి ఈ ఏడాది అక్టోబర్లో 1,19,337 కార్లు మాత్రమే తయారు చేసింది.
వీటిలో పాసింజర్ కార్ల ఉత్పత్తి 1,48,318 నుంచి 1,17,383కి తగ్గగా వ్యాన్ల ఉత్పత్తి దాదాపు సగం తగ్గింది. గత ఏడాది అక్టోబర్లో 13,817 వ్యాన్లు తయారు కాగా ఈ అక్టోబర్లో ఆ సంఖ్య 7,661కి పడిపోయింది.
ఆల్టో, ఎస్ప్రెసో, వాగనార్ వంటి కార్లు ఉన్న మినీ సెగ్మెంట్లో ఉత్పత్తి 34,295 నుంచి 20,985కి తగ్గింది. బాలెనో, డిజైర్, వంటి కార్ల ఉత్పత్తి 74,167 నుంచి 64,079కి తగ్గింది. జిప్సీ, బ్రెజ్జా, ఎక్స్ఎల్ 6, ఎస్క్రాస్ వంటి యుటిలిటీ వెహికల్స్ ఉత్పత్తి మాత్రమే కాస్త పెరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?