టాలీవుడ్ లో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ, నాచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానికి భలే భలే మగాడివోయ్ సినిమాతో అదిరిపోయే విజయాన్ని ఇచ్చాడు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో నానికి మంచి హిట్ దక్కింది. ఇక ఈ చిత్రం తర్వాత నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ వరకు వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఇక ‘భలే భలే మగాడివోయ్’ ముందు వరకు కూడా మారుతి మీద ఆయన మొదటి సినిమాల ప్రభావం కాస్త ఉండేది.
కాని ఈ సినిమా తర్వాత మారుతి ఇమేజ్ మొత్తం మారిపోయింది. మంచి ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇలా మారుతికి, నానికి మరచిపోని చిత్రంగా భలే భలే మగాడివోయ్ నిలిచిందని చెప్పాలి. అయితే అప్పటి నుండి ఈ హిట్ కాంబోలో మరో సినిమా రాలేదు.. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్లో మరో సినిమా తెరమీదకు వస్తుందట. ఈ ఇద్దరూ కలయికలో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
ఇక ఈ ఏడాది అమెజాన్ ద్వారా ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నానికి ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. దానికి తోడు ఈ ఏడాది కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన నాని ఈ గ్యాప్ ను ఫిల్ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలో టక్ జగదీష్ ను పూర్తి చేసిన నాని మరో వైపు రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఉండగానే ‘అంటే సుందరానికి’ అనే సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
కాగా నానికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మారుతి అడగడంతో నో చెప్పలేక వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం. అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే అంతకు ముందే నాని – మారుతి కాంబినేషన్ లో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందట. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ లో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!