మాస్ మహారాజాను అలాంటి రోల్ లో ఊహించుకోగలమా?

Share

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెల్సిందే. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నుండి సరైన సక్సెస్ అందలేదు. రీసెంట్ గా వచ్చిన మూడు సినిమాలు టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంథోనీ, డిస్కో రాజా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. డిస్కో రాజా అయితే సింగిల్ డిజిట్ షేర్ కే అంకితమైపోయింది.

 

mass maharaja raviteja to be seen as lawyer in his next

 

ఈ నేపథ్యంలో రవితేజ చేస్తున్న చిత్రం క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు రవితేజ. శృతి హాసన్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కరోనా రాకపోయి ఉండుంటే సమ్మర్ లోనే క్రాక్ విడుదలైపోయేది. అయితే దసరా తర్వాత ఈ చిత్ర బ్యాలెన్స్ షూట్ ను మొదలుపెట్టి నవంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది ప్లాన్. దీని తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని చేయాల్సి ఉంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం రవితేజకు మారుతి కథను వినిపించాడట. మారుతి చెప్పిన స్క్రిప్ట్ రవితేజకు తెగ నచ్చేసిందని టాక్. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా మారుతి – రవితేజ సినిమా ఉండనుంది. రమేష్ వర్మ సినిమా కంటే ముందే మారుతీ చిత్రం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజా సమాచారం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మారుతి స్క్రిప్ట్ లో రవితేజది లాయర్ పాత్ర అంటున్నారు. రవితేజకు నిజంగా లాయర్ పాత్ర అంటే చాలా కొత్తగా ఉంటుంది. మరి అటువంటి పాత్రలో రవితేజ ఎలాంటి పెరఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

 


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

13 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago