పవన్ కల్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కి పండగే. రిలీజ్ కోసం వెయిటింగ్, అప్డేట్స్ కోసం ఆరాటం.. షరా మామూలే. ఇవి కాకుండా ఇప్పుడు మళయాళ సూపర్ హిట్ ఫిలిం ‘అయ్యప్పణుమ్ కోషియమ్’ సినిమా రీమేక్ చేయడానికి యాక్సెప్ట్ చేసి పూజా కార్యక్రమం కూడా జరిపేశారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుందని సమాచారం. మల్టీస్టారర్ గా తెరకెక్కే ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారో అని అప్పుడు ఆసక్తి మొదలైంది. దీంతో ఓ ఫేమస్ టైటిల్ పెడతారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలసి మల్టీస్టారర్ గా 1982లో చేసిన సూపర్ హిట్ సినిమా ‘బిల్లా-రంగా’. ఈ సినిమా అప్పట్లో హిట్ అయింది. కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ కలిసి చేసిన ఈ యాక్షన్ మూవీ టైటిల్ కే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు పవన్ – రానా కలిసి చేస్తున్న ఈ సినిమాకు బిల్లా – రంగా టైటిల్ నే పెడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఈ టైటిల్ పై క్రేజ్ తో ఉన్నాయి. మేకర్స్ కూడా ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ఫిలింనగర్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వార్తపై ఇంకా ఎటువంటి క్లారిటీ టీమ్ నుంచి రాకపోయినా గాసిప్ గా రౌండ్ అవుతోంది.
పవన్ – రానా కలయిక అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా కథ, సన్నివేశాలు కూడా వీరిద్దరి మధ్య నువ్వా.. నేనా అన్నట్టు సాగుతాయి. ఈ టైటిల్ తెలుగు నేటివిటీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరి సితార ఎంటర్ టైన్మెంట్స్, పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు బిల్లా-రంగా సినిమా చేయాడానికి నేను రెడీ.. నువ్వు రెడీనా అని ఆమధ్య సాయి ధరమ్ తేజ్ కు మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ పై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.