సౌతిండియాలో “ఖైదీ” సినిమా తో స్టార్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ నటించిన “మాస్టర్” Master Movie భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా గానీ రెండు వారాలు తిరిగేసరికి సినిమా అమేజింగ్ ప్రైమ్ లో ఓటిటి లో దర్శనమివ్వడంతో విజయ్ అభిమానులు షాక్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు 10:15 టైం లో మాస్టర్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేసేయబోతున్నారు. పెద్ద ఎత్తున థియేటర్లో రిలీజ్ చేసి అది కూడా స్టార్ హీరో అయినా సినిమా నీ రెండు వారాలకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నిర్మాతలు రిలీజ్ చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు.
ఇప్పటికే సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో చాలా నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత తాజా ఎత్తుగడ మరింత మట్టి కొట్టుకునేలా చేసింది. పైగా థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ కారణంగా సినిమా రిలీజ్ అయినా గాని డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో మాస్టర్ నీ నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి అదం పాతాళం అన్నట్టు మారింది. ఇంత దారుణంగా ఓటీటీ లో సినిమాని రిలీజ్ చేయడం అంటే తమ పొట్టని కొట్టినట్లే అని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన మామూలు గ్రాస్ లో తమకు దక్కే షేర్ లో 10 శాతం అదనంగా ఇవ్వాలని మాస్టర్ నిర్మాతలపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలాఉంటే “మాస్టర్” డిజిటల్ రైట్స్ 36 కోట్లు పెట్టి అమెజాన్ సొంతం చేసుకోవటంతో పుల్ ఖుషి లో నిర్మాతలు ఉన్నారట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!