మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ

మెల్ బోర్న్ టెస్ట్ లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ తో జరుగుతున్న నాలుగు టెస్టులు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో టెస్ట్ లో తొలుత టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ హనుమ విహారి వికెట్ ను తొలి సెషన్ లోనే కోల్పోయింది. అయితే ఆ తరువాత మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారాలు బౌన్సీ పిచ్ పై జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో లంచ్ విరామ సమయానికి 57/1 స్కోరుతో నిలిచింది. లంచ్ తరువాత కొద్ది సేపటికే మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి టెస్ట్ లోనే మయాంక్ అగర్వాల్ హాప్ సెంచరీ సాధించడం విశేషం. ప్రస్తుతం అగర్వాల్ 52 పరుగులతోనూ, పుజారా 17 పరుగులతోనూ ఆడుతున్నారు. స్కోరు 83/1