NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara: నేడు వనంలోకి దేవతలు

Medaram Maha Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నేటితో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమైన మేడారం జాతర నేటితో పరిసమాప్తం అవుతుంది. ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే ఈ జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సారి ఏర్పాట్లకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది.

వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా విచ్చేసిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లులను దర్శించుకుని ఎత్తు బంగారాల మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మలను శుక్రవారం రాత్రి వరకూ కోటి 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. గత నెల రోజుల నుండి జాతర ముందు వరక 50లక్షల మంది, జాతర సమయంలో 70 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

ఇంత పెద్ద జాతరను కేంద్రం కుంభమేళాకు సమానంగా గుర్తించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగియనుంది.

ఈ రోజు సాయంత్రం పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వన దేవతలను తిరిగి అడవికి తరలిస్తారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిరాజును మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి తరలిస్తారు. దీంతో జాతరను ముగించినట్లు అవుతుంది. శనివారం పౌర్ణమి కావడం.. జాతర తుది ఘట్టానికి చేరనుండటంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.

Botsa Satyanarayana: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. బకాయిలు, పీఆర్సీపై బొత్స ఏమి చెప్పారంటే..?

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?