Veena Vani: ఎట్టకేలకు అవిభక్త కవలలు వీణా-వాణిల ఆపరేషన్ సొమ్ము ఇచ్చేసిన ఆ ప్రముఖ మీడియా సంస్థ..!!

Share

Veena Vani: వరంగల్ ప్రాంతానికి చెందిన అవిభక్త కవలలు వీణ వాణి అక్క చెల్లెలు గురించి అందరికీ తెలుసు. చిన్ననాటి నుండి ఓకే తలకాయ తో ఒక వింత కరమైన వ్యాధితో బాధపడుతూ జన్మించడం జరిగింది. ఓకే తలకాయి రెండు శరీరాలు కావడంతో ఇద్దరు ఆడపిల్లలు.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రులకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదు. ఇటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్ 2012వ సంవత్సరంలో… ఇద్దరు ఆడపిల్లలను మీడియా లో చూపించి రకరకాల ప్రకటనలు వేసి దాతలు స్పందించాలని, ఆపరేషన్ కోసం ముందుకు రావాలని… సదరు మీడియా చానల్ ప్రకటనల మీద ప్రకటనలు చేయడం జరిగింది. 2012వ సంవత్సరం జనవరి నుండి దాదాపు ఆగస్టు మాసం వరకు అవిభక్త కవలలు వీణ వాణి ల ఆపరేషన్ కోసం భారీగా విరాళాలు సేకరించడం జరిగింది.

Can't separate Warangal conjoined twins, say AIIMS doctors

అయితే ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నా గానీ పెద్దగా ఏర్పాటు కాలేదు. దీంతో ఆపరేషన్ కోసం సదరు మీడియా ఛానల్స్ సేకరించిన విరాళాలు ఏమైపోయాయి అన్నదానిపై రకరకాల వార్తలు… రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో అదే రీతిలో మీడియా సర్కిల్స్ లో వినపడ్డాయి. ఇటువంటి తరుణంలో సదరు మీడియా ఛానల్ ని వ్యతిరేకించే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆ మీడియా అధినేత.. విరాళాలు సేకరించి స్వార్థానికి ఉపయోగించుకున్నట్లు రకరకాల ఆరోపణలు చేశారు. అయినా కానీ ఆ టైంలో పెద్దగా సదరు మీడియా యాజమాన్యం స్పందించలేదు. మరోపక్క వీణా వాణి ల ఆపరేషన్ కూడా జరగలేదు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా సదరు మీడియా ఛానల్ యాజమాన్యం అవిభక్త కవలలు వీణా వాణీలకు కోసం వచ్చిన డబ్బు మొత్తం అప్పట్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసినట్లు అది ఇప్పుడు… వడ్డీగా మారి అధిక మొత్తంగా రావటంతో ఆ డబ్బుని సదరు కుటుంబ సభ్యులకు ఇవ్వటం జరిగినట్లు లేటెస్ట్ వార్త వస్తోంది.

ఫిక్సిడ్ డిపాజిట్ డబ్బులు మొత్తం వీణ వాణి ల ఫామిలీ చేతికి..

అప్పట్లో దాదాపు రెండు లక్షలకు పైగా విరాళాలు రావడంతో దానిని ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్సడ్  డిపాజిట్ చేయగా… దాదాపు ఇప్పుడు అది ఐదు లక్షలకు పైగా డబ్బు మొత్తం వచ్చినట్లు ఈ మొత్తాన్ని.. వీణా వాణీల కుటుంబానికి… సదరు మీడియా ఛానల్ యాజమాన్యం ఇవ్వడం జరిగింది అంట. వారి ఆపరేషన్ జరుగుతుందో లేదో.. అనే పరిస్థితి ఉండటంతో పాటు మరో పక్క మీడియా పై ఈ విషయంలో నెగిటివ్ ప్రచారం బాగా వైరల్ అవుతూ ఉండటం తో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టే తరహాలో.. వచ్చిన మొత్తం సొమ్మును వీణావాణిలా భవిష్యత్తు కోసం వారి చదువు అదే రీతిలో ఆరోగ్యం ఇంకా బాగోగుల కోసం ఖర్చు చేయాలని సదరు మీడియా ఛానల్ కుటుంబాన్ని కి ఇవ్వడం జరిగిందట. ఇప్పటికీ కూడా ఇవ్వకపోతే సొమ్ము నొక్కేశారు అనే నింద మీడియాపై పడుతుందని… ఇదే సరైన టైమ్ అని… వచ్చిన విరాళం మొత్తాన్ని అవిభక్త కవలలు వీణా వాణీల కుటుంబానికి అందజేయడం జరిగిందట. ఏది ఏమైనా ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు సదరు మీడియా ఛానల్ పై రకరకాల విమర్శలు చేస్తూ ఉన్న తరుణంలో తాజాగా వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెడుతూ… వీణా వాణీల కుటుంబానికి.. సదరు మీడియా అధినేత డబ్బులు ఇచ్చేయడం.. సంచలనంగా మారింది. అయితే ఆ ప్రముఖ మీడియా సంస్థ మరి ఏదో కాదు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. సదరు మీడియా సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ ఈ కవల పిల్లల ఆపరేషన్ పేరు చెప్పి.. భారీగా డబ్బులు గుంజినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ మీడియా ఛానల్ వ్యతిరేకించే వైసిపి, టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ విషయంలో తీవ్ర స్థాయిలో రాధాకృష్ణపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో తాజాగా… సదరు ఆడపిల్లల కుటుంబానికి 5 లక్షల రూపాయలు.. ఈ మీడియా ఛానల్ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే విరాళాలు లక్షల్లో కాదు కోట్లల్లో డబ్బులు వచ్చాయని..సదరు మీడియా సంస్థ ఆ విరాళాలు అడ్డంగా నొక్కేసినట్లు… కేవలం ఐదు లక్షలు వీణా వాణీల కుటుంబానికి అప్పజెప్పి.. సదరు మీడియా అధినేత చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు.. తాజా వార్త పై కొన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు.


Share

Related posts

YS Jagan : నిమ్మగడ్డ అడ్డాలో మీసం మెలేసిన వైఎస్ జగన్ – చరిత్ర చెప్పుకునే విజయం ఇది.

somaraju sharma

పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం

Siva Prasad

NTR: ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా.. ఫస్ట్ చేయాల్సిన హీరో ఎవరో తెలుసా..??

sekhar