NewsOrbit
న్యూస్

దివ్యాంగ మీసేవా నిర్వహకుడి ఆత్మహత్య బెదిరింపు

విశాఖ:  ఒక దివ్యాంగ మీసేవా నిర్వహకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాయిస్ మెసేజ్ పెట్టడం విశాఖపట్నం మధురవాడ ప్రాంత్రంలో కలకలం రేపింది. మీ సేవా కేంద్రాల ద్వారా అందే సేవలను ఇకపై గ్రామ సచివాలయాల్లోనే అందించాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్ణయించడంతో తన ఉపాధి పోతుందన్న ఆందోళనతో మధురవాడ వాంబే కాలనీకి చెందిన దివ్యాంగ మీ సేవా నిర్వహకుడు శ్రీహరి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ స్నేహితులకు వాయిస్ మేసేజ్ పెట్టాడు. శ్రీహరి అనే దివ్యాంగుడికి గత ప్రభుత్వం మీసేవా కేంద్రం మంజూరు చేసింది. ఆ యువకుడు దీన్ని నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు.

జనవరి ఒకటవ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని సేవలూ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో మీసేవా నిర్వహకులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన మీసేవా నిర్వహకులు గత పది రోజులకుపైగా కేంద్రాలను మూసివేసి నిరసన ఉదృతం చేశారు. వీరి ఆందోళనకు ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీహరి అనే యువకుడు తన మిత్రులకు పంపిన  వాయిస్ మేసేజ్‌లో ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించాడు. ప్రభుత్వం వెంటనే భరోసా ఇవ్వాలనీ లేకుంటే తన మీసేవా కేంద్రంలోనే ఆత్మహత్య చేసుకుంటాననీ పేర్కొన్నాడు. ఈ సందేశం చూసిన అతని స్నేహితులు హుటాహుటిన వాంబే కాలనీలోని వెళ్లి మీసేవ కేంద్రంలోనే తలుపువేసుకుని ఉన్న అతన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment