ఓటీటీ లో మెగా హీరో సినిమా .. !!

కరోనా కారణంగా సినిమా ధియేటర్లు క్లోజ్ అవటంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ కి మంచి గిరాకీ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులంతా ఓటిటి కి అలవాటు పడుతున్నారు. మరోపక్క థియేటర్ యాజమాన్యాలు సినిమాలను ఓటిటీలో రిలీజ్ చేయొద్దని మొత్తుకుంటున్న…. కరోనా ఎఫెక్ట్ తో  నార్మల్ పరిస్థితులు వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే లేకపోవడంతో, చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఓటిటి నీ ఆధారం చేసుకుని సినిమాలను రిలీజ్ చేసేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓటిటి లో విడుదలైన సినిమాలు చిన్నా చితకా  సినిమాలే.

 

Solo Brathuke So Better Movie | Cast, Release Date, Trailer ...కాగా మొట్ట మొదటి సారి ఇండస్ట్రీలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా ఓటీటి లో రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే “సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమాని ఓటిటీ లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఇదే తరుణంలో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ సినిమా నిర్మాతలకు ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోపక్క సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్టార్ హీరోల సినిమాలు…. ఈ విధంగా ఓటీటీ లో రిలీజ్ అయితే మా పొట్ట కొట్టినట్లు అవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. పరిస్థితి ఇలా ఉండగా సినిమా మొత్తం పూర్తవడంతో మెగాహీరో టెంప్ట్ అయితే కనుక ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ చేసేయాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు సమాచారం.