రేయ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు మెగా హీరో సాయి ధరం తేజ్. అయితే ఆ సినిమా కంటే ముందే ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం రిలీజై సూపర్ హిట్ ని అందుకుంది. మొదట రిలీజైన ఈ సినిమాతోనే మెగా మేనళ్ళుడు అనిపించుకున్నాడు. నటనలో డాన్స్ లో అచ్చం మావయ్య మెగాస్టార్ లా ఉన్నాడన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సుప్రీం కూడా మంచి సక్సస్ ని సాధించింది.
ఇలా కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్స్ అందుకున్న సాయి ధరం తేజ్ మధ్యలో వరసగా ఫ్లాప్స్ ని చూశాడు. జవాన్, ఇంటిలిజెంట్ వంటి సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజై తీవ్రంగా నిరాశ పరచాయి. దాదాపు ఆరు సినిమాలు వరసగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఎట్టకేలకి మళ్ళీ కిషోర్ తిరుమల తో చేసిన చిత్రల హరి ఒక మోస్తారు హిట్ ని అందుకొని సక్సస్ ట్రాక్ ఎక్కాడు. ఇక రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చాడు.
ప్రస్తుతం సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు రిలీజ్ కి సిద్దంగా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజైన నో పెళ్ళి సాంగ్ సినిమా మీద భారీ అంచనాలను తీసుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్థానం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవా కట్ట తో సాయి ధరం తేజ్ సినిమాని కమిటయ్యాడు. జె పుల్లారావు భగవాన్ ఈ సినిమాకి నిర్మాతలు. అయితే తేజు దర్శకుడికి ఇప్పుడే మనం సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెల్లొద్దని సూచించాడట. సోలో బ్రతుకే సో బెటరు రిజల్ట్ చూసుకున్నాక ఈ సినిమా గురించి ఆలోచిద్దామని అన్నాడట. దీంతో షాక్ లో ఉన్నాడట దర్శకుడు దేవా కట్టా.