Chiranjeevi: కుర్ర దర్శకుడితో చేతులు కలిపిన చిరంజీవి.. ఇక మెగా ఫ్యాన్స్‌కు పండగే

Share

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నాక టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు విడుదల అవ్వక ముందే వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కోరటాల శివ దర్శకత్వలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా, కొవిడ్ కారణంగా రెండో భాగం షూటింగ్ వాయిదా పడటంతో లేట్ అయ్యింది. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తుందన్నారు అందరూ. కానీ ‘ఆర్ఆర్ఆర్ ’అదే టైం వస్తుందని తెలుసుకుని మరోసారి దీని విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో తండ్రి కొడుకులు చిరు, చెర్రీ నక్సలైట్లుగా కనిపించనున్న విషయం తెలిసిందే.

సూపర్ హిట్ మూవీస్ రీమేక్‌లో..

 

ఇకపోతే చిరు ఆచార్య తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీని మూవీ ‘వేదాళం’ను తెలుగులో ‘భోళా శంకర్’గా తెరకెక్కుతుండగా అందులో చిరు లీడ్ రోల్ చేస్తున్నారు. అదేవిధంగా మళయాళంలో హీరో మోహన్ లాల్ నటించిన ‘లూసీఫర్’ మూవీని చిరు హీరోగా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో దర్శకుడు మోహన్ రాజా రీమెక్ చేస్తున్నారు.

కుర్రదర్శకుడికి ఓకే చెప్పిన చిరు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుర్ర దర్శకుడు ‘వెంకీ కుడుముల’తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఆయన ఇంతక ముందు ‘చలో’, ‘భీష్మ’వంటి సూపర్ హిట్ మూవీస్‌ను తెలుగు ఇండస్ట్రీకి అందించారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో చిరు కూడా ఓకే చెప్పారట.. ఇందులో చిరుకు జోడిగా కన్నడ భామ ‘రష్మిక మందన్నా’ను అనుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ రానుంది. కాగా, వరుసగా చిరు సినిమాలు వస్తుండటంతో రాబోయే రోజులు మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పుకోవచ్చు.


Share

Related posts

 కరోనా ముందు… కోతల మందు..!!

somaraju sharma

Kajal agarwal : 15 ఏళ్ళ కెరీర్ లో కాజల్ చేస్తున్న ఛాలెంజింగ్ రోల్ ఇదే..!

GRK

Udaya bhanu : ఉగాది స్పెషల్ ఈవెంట్ లో మెరిసిన ఉదయభాను

Varun G