Megastar Acharya : శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతకాలపై నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తున్న చిత్రం ఆచార్య… తాజాగా ఆచార్య టీజర్ ను విడుదల చేశారు.. సోషల్ మీడియాలో ఈ టీజర్ చక్కర్లు కొడుతోంది..
మెగా స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేసింది..
“ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం..అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు.. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..”ఓ ఆచార్య గురుదేవోభవ.. ఓ ఆచార్య ప్రక్షోభవ అంటూ ఈ టీజర్ ముగిసింది..
ఈ సినిమాను మే 13న విడుదల చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది .ఈ సినిమాకోసం హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేట లో వేసిన భారీ టెంపుల్ సెట్‌ను ఈ టీజర్లో మనం చూడవచ్చు. ఇండియాలో అతిపెద్ద బారి టెంపుల్ సెట్ ఇది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!